కావలసిన వస్తువులు:
బియ్యపు పిండి - ఒక కేజి పెసరపప్పు - 1/4 కిలో (పొట్టు లేనివి) వెన్న లేదా డాల్డా - 200 గ్రాములు అల్లం - 50 గ్రాములు పచ్చి మిరపకాయలు - సరిపడ. జీలకర్ర - 1 టేబుల్ స్పూన్ నూనె - కాల్చేందుకు సరిపడ ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం:
ముందుగా బియ్యాన్ని పిండిని తయారు చేసుకోవాలి. పెసర పప్పును ఒక గంట నానబెట్టాలి. అల్లం, మిరపకాయలను ముక్కలుగా తరిగి ఆ తర్వాత మెత్తని పేస్టులా చేసుకోవాలి. బియ్యపు పిండిలో నానిన పెసర పప్పును, అల్లం పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని, వెన్న లేదా డాల్డాను, జీలకర్రను తగినంత ఉప్పును వేసి బాగా కలపాలి. ఇప్పుడు పిండిని నాలుగు సమాన భాగాలుగా చెసుకుని ఒక్కో భాగం చొప్పున నీళ్ళతో కలుపుకుంటూ చెక్కలను తయారుచేసి బంగారు రంగు వచ్చేలా నూనెలో కాల్చాలి. పిండిని ఎప్పటికప్పుడు కలుపుతుంటే చెక్కలు బాగా గుల్లగా వస్తాయి.
|