| సంవత్సరం-2008. ఈ యేడాదికి దేశ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు లభించింది. దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో అధికార మార్పిడికి కేంద్ర బిందువుగా నిలిచింది. అందుకే ఈ యేడాదిని ఎన్నికల నామ సంవత్సరంగా పిలుస్తున్నారు. ఈశాన్య భారతం మొదలుకొని.. ఉత్తర, దక్షిణాదిల్లోని కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. ఇలాంటి వాటిలో కీలకమైనవి రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలు. రెండు మూడు రాష్ట్రాల్లో మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ అధికార మార్పిడి జరిగింది. |