శ్రీముఖ నామసంవత్సర దక్షిణాయన వర్ష ఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాలుగో పాదాన బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల దంపతులకు శ్రీకృష్ణుడు జన్మించాడు. అలా జన్మించిన ఆ బాలుడు దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతూ.. తన లీలావినోదాదులచే చిరు ప్రాయం నుంచే అడుగడుగనా భక్తులను జ్ఞానోపదేశం చేస్తూ, అపారప్రజ్ఞాపాఠవాలు కిలిగిన దైవాంస సంభూతులుగా ఎదిగుతూ వచ్చాడు. ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగిలిస్తూ వెన్నదొంగగా ముద్ర వేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనములో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందట! వెన్న జ్ఞానికి సంకేతంగా చెపుతుంటారు మన పెద్దలు. |