ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు > వైభవంగా ముగిసిన అంకురార్పణ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వైభవంగా ముగిసిన అంకురార్పణ
FILE
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టే అంకురార్పణ కార్యక్రమం మంగళవారం రాత్రి వైభవంగా ముగిసింది. శ్రీవారి సర్వసైనాధ్యక్షుడైన విష్వక్సేనుడు ఊరేగింపు ప్రారంభ సందర్భంలో వరుణుడు చిరుజల్లులతో స్వామి వారిని పలకరించాడు.

చిరుజల్లుల ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య అంకురార్పణ కార్యక్రమం భక్తులను కనువిందు చేసింది. తిరుమాడ వీధుల్లో సేనాధిపతి ఊరేగింపు పూర్తయ్యే వరకు వరుణుడు చిరుజల్లులను కురిపిస్తూనే ఉన్నాడు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమానికి తితిదే పాలకమండలి ఛైర్మన్ డి.కె. ఆదికేశవులు నాయుడు, ఈవో రమణాచారి జేఈవో శేషాద్రి వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వెంకన్న బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం!
స్వర్ణమయ పథకాన్ని ప్రారంభించనున్న వైఎస్
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ  
తిరుమలలో ప్రారంభమయిన బ్రహ్మోత్సవాల కోలాహలం
దేవునికి హారతి ఇచ్చేటపుడు గంట కొట్టడమెందుకు...?