ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు > వైభవంగా జరిగిన ముత్యపు పందిరి వాహన సేవ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వైభవంగా జరిగిన ముత్యపు పందిరి వాహన సేవ
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి ముత్యపు పందిరి వాహన సేవ భక్తులను కనువిందు చేసింది. తిరుమలేశుడు ముత్యపు పందిరి వాహనంపై కాళీయమర్దనం అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. సర్వాలంకారణా భూషితుడైన శ్రీవారు ముత్యపు పందిరి వాహనంపై దేవేరుల సమేతంగా మాడవీధుల్లో ఊరేగిన వైభవాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తులు తిరుపతి కొండకు తరలి వచ్చారు.

చంద్రోదయ వేళలో ఆహ్లాదకర వాతావరణంలో చిన్న జీవరాశులను సైతం అనుగ్రహించే ఆ పరమాత్మ ముత్యాలతో అలంకరించిన పల్లకిలో శ్రీదేవి, భూదేవిలతో కాళీయ మర్ధనుడి అవతారంలో భక్తులకు అనుగ్రహం ప్రసాదించారు.

ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం మలయప్ప స్వామి సింహవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. స్వర్ణకచ్ఛిత సింహవాహనాన్ని అధిరోహించిన శ్రీనివాసుడు ధర్మరక్షణార్థం అవతరించిన నరసింహ స్వామి అవతారంలో భక్తులకు అభయమిచ్చారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
వీడియోను వీక్షించండి
మరిన్ని
ఈ నెల 12 నుంచి చెన్నైలో మహా యాగం  
ముత్యపు పందిరి వాహనంపై ఊరేగనున్న శ్రీవారు  
వీణాపాణియై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు  
చిన్నశేషవాహనంపై ఊరేగిన వెంకన్న  
బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు సెల్లార్ దర్శనాలు రద్దు!
సింహవాహనంపై ఊరేగుతున్న మలయప్ప స్వామి