ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు > హనుమంతునిపై మలయప్ప స్వామి విహారం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హనుమంతునిపై మలయప్ప స్వామి విహారం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజైన సోమవారం హనుమంత వాహన సేవ ఘనంగా జరుగుతోంది. సర్వాలంకరణా భూషితుడైన శ్రీవారు తన భక్తుడైన హనుమంతుని వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్నారు. లక్షలాది భక్తకోటి గోవింద నామ స్మరణతో తిరుమల కొండ మారు మ్రోగుతోంది.

నేడు (సోమవారం) సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణరథం, రాత్రి గజవాహన సేవలు జరుగనున్న నేపథ్యంలో...తిరుమలేశుని దివ్యానుగ్రహం పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఆదివారం రాత్రి అత్యంత ప్రధానమైన శ్రీవారి గరుడసేవ అంగరంగవైభవంగా జరిగింది. ఆదివారం ఉదయం కలియుగదైవం శ్రీనివాసుడు మోహిని అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

మోహినిని బంగారపు చీర, సూర్య - చంద్ర హారాలు, రత్న కిరీటాలు, కర్ణ పత్రాలు వీటితో పాటు వజ్రపు ముక్కుపుడకతో అలంకరించి, శ్రీకృష్ణుడితోపాటు మోహినిని కూడ పల్లకీలో ఊరేంచిన వైనం భక్తులను కనువిందు చేసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అత్యంత వైభవంగా శ్రీవారి గరుడోత్సవం
గరుడ సేవకు భక్తులందరికీ దర్శనం
'మోహిని' అవతారంలో శ్రీనివాసుడు
సర్వభూపాల వాహనంపై వెంకన్న విహారం
గరుడోత్సవానికి రంగం సిద్ధం
కల్పవృక్ష వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి