ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు > వసతి సౌకర్యాలకు కాణాచి తిరుమల...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వసతి సౌకర్యాలకు కాణాచి తిరుమల...
WD
ప్రమాద రహిత ఘాట్ రోడ్లు
ప్రతిరోజు దైవదర్శనంకోసం బస్సుల ద్వారా లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా వచ్చే వేలాదిమంది భక్తులను శరవేగంగా తిరుమలకు చేరవేయడానికి, సురక్షితంగా వారిని దిగువ తిరుపతికి పంపడానిగి గాను తిరుమల-తిరుపతి మధ్య దేవస్థానం ప్రమాదమన్నదే ఎరుగని రీతిలో సురక్షితమైన ఘాట్ రోడ్లను నిర్మించింది. సాధారణ సందర్భాల్లో రోజుకు 35 వేలమంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుండగా శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తుల రాకతో తిరుమల గిరి పోటెత్తుతూ ఉంటుంది. శ్రీ మహా విష్ణువు శ్రీవేంకటేశ్వరుడిగా అవతారమెత్తిన సందర్భాన్ని పునస్కరించుకుని దసరా సమయంలో 9 రోజుల పాటు తిరుమలలో జరిపే అఖండ ఉత్సవాలనే బ్రహ్మోత్సవాలు అని పిలుస్తుంటారు.

నిరంతరం మంచి నీరు, విద్యుత్తు సరఫరా
తిరుమల పట్టణంలో స్థానిక జనాభా అయిదు వేలకు మించి ఉండరంటే ఆశ్చర్యం వేస్తుంది కానీ, అసంఖ్యాకంగా తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం దీన్ని 6.5 మెగావాట్ల విద్యుచ్ఛక్తి, 30 లక్షల గ్యాలన్ల నీటి సరఫరాతో కూడిన శాటిలైట్ పట్టణంగా అభివృద్ధి చేశారు. ఈ ఆలయ పట్టణంలో పది కిలోమీటర్ల పొడవునా తారు రోడ్డును, సిమెంట్ రోడ్లను నిర్మించారు. పైగా కొంతమంది దాతలు అందించిన రూ. 5 కోట్ల ఖర్చుతో నీటి శుద్ధీకరణ పథకాన్ని అమలు చేసి మరింత చవకగా మంచినీటిని అందించడానికి పూనుకుంటున్నామని తిరుమల నీటి నిర్వహణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రవి ప్రభాకర్ పేర్కొన్నారు. భక్తులకు చవక ధరలతో, సురక్షిత మంచినీటిని అందించడానికి తిరుమలలో విస్తృత ప్రణాళికలను రూపొందిస్తున్నారు. భక్తులకు ప్రైవేట్ వాటర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి సైతం దాతలు ముందుకు రావడం విశేషం.

ఉచిత క్షురక కేంద్రాలు...
కోరికలు నెరవేరిన వారు మొక్కుబడులను తీర్చుకునేందుకు గాను తిరుమలలో 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఉచిత మరియు నగదు చెల్లింపుతో కూడిన తలనీలాల కేంద్రాలను నియమించారు. ఇన్‌ఫెక్షన్లు రాకుండా శుబ్రపర్చిన బ్లేడ్‌లను ఉపయోగించడం ద్వారా భక్తులకు అంటు వ్యాధులు రాకుండా చూడటానికి తిరుమలలో అసాధారణ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్వామివారికి భక్తులు సమర్పించిన తలనీలాలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రపంచవ్యాప్తంగా వైద్యం, ఫ్యాషన్ పరిశ్రమలకోసం వేలం వేస్తుంటారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
1 | 2  >>  
మరిన్ని
గోవిందా... గోవిందా... వెంకటరమణా గోవిందా...
గరుడసేవకు ఏడులక్షల మంది భక్తులు?
హనుమంతునిపై మలయప్ప స్వామి విహారం
అత్యంత వైభవంగా శ్రీవారి గరుడోత్సవం  
గరుడ సేవకు భక్తులందరికీ దర్శనం
'మోహిని' అవతారంలో శ్రీనివాసుడు