ప్రధాన పేజి » ఇతరాలు » వెబ్‌దునియా స్పెషల్ 08 » బ్రహ్మోత్సవాలు » బ్రహ్మోత్సవాలు: సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు (Sarva Bhupala Vahanam vedio | Tirumala Brahmostavas | Srinivasudu | TTD)
తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం రాత్రి శ్రీమలయప్ప స్వామి సర్వభూపాల వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తజనకోటికి కనువిందు చేశారు. లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తానేనని లోకానికి చాటుతూ స్వామి ఈ వాహనంపై కొలువుదీరుతాడు. ఈ వాహనసేవ జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వత ఫలాన్ని ఇస్తుంది.

అంతకుముందు.. ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడు ఊరేగిన విషయం తెల్సిందే. తన భక్తులకు అడగకుండానే వరాలిచ్చే దేవదేవుడు వేంకటేశ్వరుడు.. అన్నం, వస్త్రాలు, కోర్కెలు మాత్రమే తీర్చగలడనే నమ్మకం ఉందన్నారు. కానీ స్వామి శాశ్వత కైవల్యం ప్రసాదించే కల్పతరువు. నాలుగో రోజు ఉదయం ఈ వాహనంపై వెంకన్న సర్వాలంకార భూషితుడై ఊరేగాడు.
సంబంధిత సమాచారం
దీన్ని కూడా శోధించు: సర్వభూపాల వాహనం, తిరుమల బ్రహ్మోత్సవాలు, శ్రీనివాసుడు, తితిదే