రసాయన శాస్త్రాన్ని అనుసరించి మనలో ప్రేమ భావనలు చెలరేగడానికి హృదయంతో పాటుగా మెదడు కూడా సహకరిస్తుంది. మెదడులో ఉత్పన్నమయ్యే డోపామైన్ అనే హార్మోన్ మనిషిలో శృంగారపూరిత తలంపులు కలిగించే బాధ్యతను తీసుకుంటుందని అమెరికాకు చెందిన మానసిక శాస్త్రవేత్త హెలెన్ ఫిషర్ పేర్కొన్నారు. అంతటితో ఆగక మనిషిలో తీవ్రమైన ఉత్తేజాన్ని డోపామైన్ కలిగిస్తుంది. ఇదంతా కూడా ప్రేమ సమీకరణలకు దారి తీస్తుంది.
ఇప్పటి వరకు హృదయం, గుండె చప్పుళ్లతో ప్రేమకు ఏదో తెలియని లంకె ఉంటూ వచ్చింది. అయితే ప్రేమ వెనుక దాగిన సంగుతులు ఎన్నో ఉన్నాయి. తొలి చూపులోనే ప్రేమ కలుగుతుందని అనుభవజ్ఞులు చెప్పడంతో పాటు అనేక పుస్తకాలలో... |