ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > వినాయక చవితి > విఘ్నేశ్వరునికి జయమంగళం...! నిత్య శుభమంగళం...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
విఘ్నేశ్వరునికి జయమంగళం...! నిత్య శుభమంగళం...!
WD
వినాయక చవితి నాడు మట్టితో చేసిన గణనాధుని పూజించిన తర్వాత భక్తులు ఈ క్రింది శ్లోకాన్ని పఠించాలి. తద్వారా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

"శ్రీ శంభు తనయునకు సిద్ధిగణనాథునకు
వాసిగల దేవతా వందితునకు
ఆ సరస విద్యలకు ఆదిగురువైనట్టి
భూసురురోత్తమ లోకపూజ్యునకు"
''జయమంగళం నిత్య శుభమంగళం''

"నేరేడు మారేడు నెలవంక మామిడి
దూర్వార చెంగల్వలుత్తరేణు
వేరువేరుగ తెచ్చి వేడ్కతో పూజించు
పర్వమున దేవగణపతికినిపుడు"
''జయమంగళం నిత్య శుభమంగళం''

"సుచిరముగ భాద్రపద శుద్ధ చవితియందు
పొసగ సజ్జనులచే పూజగొంచు
శశి చూడరాకున్న చేకొంటినొక వ్రతము
పర్వముగ దేవగణపతికినిపుడు"
''జయమంగళం నిత్య శుభమంగళం''

"పానకము వడపప్పు, పనసమామిడి పండ్లు
దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు
తేనెతో మాగిన తియ్యమామిడి పండ్లు
పర్వముగ దేవగణపతికినిపుడు"
''జయమంగళం నిత్య శుభమంగళం''

"ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య
ఉండ్రాళ్ల మీదికి దండుబంపు
కమ్మని నెయ్యియును కడుపప్పుయును
బొజ్జనిండా దినుచు పొరలుకొనుచు"
''జయమంగళం నిత్య శుభమంగళం''
1 | 2  >>  
మరిన్ని
గణాధిపతిగా విఘ్నేశ్వరుడు...!
చంద్రుడు శాపగ్రస్థుడగుట!