"వెండి పళ్లెరములోన వేవేల ముత్యాలు కొండలుగ నీలములు కలియబోసి మెండుగను హారములు మెడనిండ వేసికొని దండిగా నీకిత్తు ధవళారతి" ''జయమంగళం నిత్య శుభమంగళం''
"పువ్వులను నిను గొల్తు పుష్పాల నిను గొల్తు గంధాన నినుగొల్తు కస్తూరిని ఎప్పుడును నిను గొల్తు ఏకచిత్తంబున పర్వమున దేవగణపతికినిపుడు" ''జయమంగళం నిత్య శుభమంగళం''
"ఏకదంతంబును ఎల్ల గజవదనంబు వాలైన తొండంబు వలపు కడుపు జోకయిన మూషికము సొరది నెక్కాడెడు భవ్యమున దేవగణపతికినిపుడు" ''జయమంగళం నిత్య శుభమంగళం''
"మంగళము మంగళము మార్తాండతేజునకు మంగళము సర్వజ్ఞవందితునకు మంగళము ముల్లోక మహితసంచారునకు మంగళము దేవగణపతికినిపుడు" ''జయమంగళం నిత్య శుభమంగళం''
"ఓ బొజ్జ గణపతి! ఓర్పుతో రక్షించి కాచి నన్నేలు మీ కరుణతోను మాపాలగలవని మహిమీదనెల్లపుడు కొనియాడి మ్రొక్కెదను కోర్కెదీర" ''జయమంగళం నిత్య శుభమంగళం' |