ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > వినాయక చవితి > చవితి నాడు అంబరంలో వినాయక నక్షత్రాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చవితి నాడు అంబరంలో వినాయక నక్షత్రాలు
భాద్రపద శుద్ధ చవితినాడు మనం వినాయక చవితి వేడుకలను జరుపుకుంటాం. అయితే, అసలు చవితినాడు పండుగ ఎందుకు చేసుకుంటాం? ఆ రోజు వినాయకుడు గణాలకు నాధుడిగా నియమించబడ్డాడు. కనుక ఆ రోజు హిందూవులకు అతి పవిత్రమైన రోజు. విఘ్నేశ్వరుని పూజించి సేవిస్తారు.

దీనికి ఇంకో కారణం కూడా ఉంది...! సూర్యోదయానికి ముందు తూర్పున ఏ నక్షత్రాలు ఉదయిస్తాయో ఆ నక్షత్రాలకు సంబంధించిన దేవుడి పండుగ జరుపుకోవాలనేది రుగ్వేదంలోని నియమం. కనుక భాద్రపద శుద్ధ చవితినాడు సూర్యోదయానికి ముందు తూర్పున వినాయక నక్షత్రాలు ఉదయిస్తాయి. కాబట్టి ఆ రోజు వినాయక చవితిగా భారత దేశంలోని హిందూవులు వేడుకలు జరుపుకుంటారు.

అలాగే, గ్రహాల్లోకెల్లా ముఖ్యమైన గ్రహం శనిగ్రహం. శనీశ్వరుడి ప్రభావం మనకు తెలిసిందే. సకల దేవతలూ భయపడే శనీశ్వరుడు స్వయం రక్షణ కోసం వినాయక కవచాన్ని ధరిస్తాడట. వినాయకుని మహత్యం ఇంతా అంతా మరి...!
మరిన్ని
మహాభారత రచనలో విఘ్నేశ్వరుడి పాత్ర!
సిద్ధి, బుద్ధిల మహాత్మ్యం!
గణాధిపతిగా విఘ్నేశ్వరుడు...!
చంద్రుడు శాపగ్రస్థుడగుట!