|
ఆత్మవిశ్వాసమే ''ఆమె'' శ్వాస : కలెక్టర్ శైలజా
|
|
|
|
|
శుక్రవారం, 7 మార్చి 2008( 16:40 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | ''వందేళ్ళ క్రితంతో పోలిస్తే నేటి మహిళకు వందల అవకాశాలున్నాయి. విద్య, ఉద్యోగ, ఉపాధి పరంగా ఎన్నో అడ్డంకులు తొలగిపోయాయి. ఎంతో సానుకూల వాతారణం ఏర్పడింది. అయితే వాటిని అందిపుచ్చుకోవడానికి ఇప్పుడు మహిళలకు కావాల్సిందల్లా ఆత్మవిశ్వాసం. కఠోరశ్రమ. క్రమశిక్షణ'' ఈ మాటల్ని "వెబ్‌దునియా తెలుగు"కు చెప్పింది ఎవరో కాదు... వీటిని ఆచరించిన డైనమిక్ లేడీ కలెక్టర్ శైలజా రామయ్యర్. 1997 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఎఎస్ అధికారిణి, ఇటీవల కృష్ణా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
గతంలో ఆమె గుంటూరు జిల్లా తెనాలి సబ్‌కలెక్టర్‌గా 1999 నవంబరు 10 నుంచి 2001 మే 20 వరకు పని చేశారు. పేద ప్రజలకు అక్కడ గూడు కల్పించి, వారి హృదయాలలో గూడుకట్టుకున్న శైలజా తాను ఏపని చేసినా, సిన్సియర్‌గా దానిని పూర్తిచేస్తారు. విధి నిర్వహణలో ప్రతి సమస్యను క్షుణంగా పరిశీలించి, మానవతాదృక్పథంలో ప్రజాహితంతో దానిని పరిష్కరిస్తారు. శైలజా రామయ్యర్ భర్త ప్రముఖ రాజకీయవేత్త దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. ఈయన కరీంనగర్ జిల్లా మంధని ఎమ్మెల్యే. ప్రభుత్వ విప్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన తండ్రి అంటే శైలజా రామయ్యర్ మామగారు ఎవరో కాదు దివంగత స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు.
అంతటి ఘనత వహించిన కుటుంబానికి కోడలుగా వచ్చిన శైలజా తమ పాప బాధ్యతల్ని చూసుకుంటూనే కలెక్టర్‌గా విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె "వెబ్‌దునియా"కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేటి మహిళకు మార్గదర్శనం చేశారు. ఆమె భర్త డి.శ్రీధర్‌బాబు సంపూర్ణ సహకారం ఉండటంతో, ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా, ప్రస్తుతం కృష్ణా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
|