నేడే ఈనాడే మనదేశం మనదైనది.. సత్యాహింసల బలమే త్యాగధనుల హృదయ బలమై, జనబలమై, ఘన ఫలమై... మనదేశం మనదైనది. తలవంపులు తొలగిపోయి, తెగతెంపులు జరిగిపోయి, వెలిగుంపులు వెడలిపోయిన సుదినం నేడే..!
ఎందరో మహానుభావుల కలల పంటలు, మరెందరో అమరవీరుల త్యాగ ఫలాలకు రూపమైన భారతావని స్వాతంత్ర్య దినోత్సవం నేడే. సకల మానవాళి సంబరాలు అంబరాన్ని తాకే మహోజ్వల దినం నేడే...!