| ఇంకా చదవండి |
| "దోస్త్ మేరా దోస్త్ తూహీ మేరా జాన్.. వాస్తవం రా దోస్త్.. నువ్వే నా ప్రాణం" అంటూ సినీ కవులు కవిత్వం రాసినా.. స్నేహానికి ఉన్న గొప్పదనం ఎన్ని రకాలుగా చెప్పినా వర్ణించేందుకు వీలుకానిదే...! అది స్వయంగా అనుభవిస్తే తప్ప, అందులోని మాధుర్యం ఎవరికీ అర్థం కాదు. అంతటి ఉన్నతమైన స్నేహానికున్న ప్రాధాన్యతను చెప్పేందుకు ఏర్పటైనదే "స్నేహితుల రోజు". | సృష్టిలో రెండక్షరాల తియ్యని బంధమే "స్నేహం". స్నేహం అనిర్వచనీయమైంది, అద్భుతమైంది. ప్రతి మనిషి జీవితంలోనూ... ఏ ప్రతిఫలాన్ని ఆశించని "స్నేహం" బంధం మొగ్గలా ప్రారంభమై, మహావృక్షంలాగా ఎదిగి జీవితాంతం తోడునీడగా నిలుస్తుంది. నిజమైన స్నేహితులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. సరిహద్దుల్ని చెరిపేసే స్నేహం వికాసానికి బాటలు వేస్తుంది. |