| | ఆ రోజన హోళీ పండుగను జరుపుకున్న ప్రతి ఒక్కరు రంగులతో తడిసి కొత్త రూపంలో దర్శనమిస్తారు. ఆ తర్వాత నూతన సౌందర్యాన్ని తెచ్చుకుంటారు. నగలూ... నట్రా, మంచి దుస్తులు వేసుకుంటేనే సౌందర్యంగా కనబడతారని చాలా మంది అనుకుంటారు. కానీ పింగళి సూరన అనే మహాకవి కళాపూర్ణోదయమనే కావ్యంలో అసలైన సౌందర్యం ఎక్కడుందో తెలిపాడు. పూర్వం శాలీనుడనే పేరుగల నాయకుడుండేవాడు. అతనికి చక్కని శరీరము, సౌందర్యవతి అయిన సుగాత్రితో వివాహమైంది. వివాహమయ్యాక ఆమెను అతనితో పొందుకోసం మొదటిరాత్రి లోనికి పంపారు. ఆ రోజు రాత్రి ఏ మల్లెలూ వాడిపోలేదు. ఏ దుస్తులు నలగలేదు. అసలు ఆమెలో కించిత్ మార్పు... |