| రాష్ట్రంలోని తెలుగు లోగిళ్లు శ్రీవిరోధి నామ సంవత్సర ఉగాదికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎన్ని పండుగలు చేసుకుంటున్నా ఉగాదికి ఉన్న ప్రత్యేకత వేరు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రతి తెలుగింటా తయారు చేసుకుని ఆరగిస్తారు. అయితే ఒక్కో ఇంటి ఉగాది పచ్చడికి ఒక్కో రుచి. ఈ నేపథ్యంలో మా వెబ్‌దునియా తెలుగు వీక్షకులకోసం ఉగాది నవ్వుల కార్టూన్లు ఉంచుతున్నాం. | ప్రపంచంలోకెల్లా విశిష్ట సంస్కృతి వైభవం కల్గిన దేశం భారతదేశం. ఈ వేదాల పురిటి గడ్డలో ప్రతి ఆచారానికీ ఎంతో అర్ధముంది. ప్రతి సాంప్రదాయానికి మరెంతో పరమార్ధం ఉంది. భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మగా వెలుగొందుతున్న 'తెలుగునేల' జరుపుకునే పండుగలలో ప్రత్యేకమైనదీ, సందేశాత్మకమైనదీ 'ఉగాది' పండుగ. |