ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 2009 > వాలెంటైన్ డే > హాయ్ లవ్ బర్డ్స్... తాజ్‌లో మంచి కాఫీ రుచి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హాయ్ లవ్ బర్డ్స్... తాజ్‌లో మంచి కాఫీ రుచి
WD
రాష్ట్ర రాజధాని నగరంలో వాలెంటైన్ డే సెలబ్రేషన్‌ను జరుపుకునే ప్రేమికులకోసం తాజ్ బంజారా ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఫిబ్రవరి 13, 14 తేదీలలో వాలెంటైన్ వీకెండ్ నైట్స్ పేరిట తాజ్ బంజారాలో లవ్‌బర్డ్స్ కోసం ఆహ్లాదకరమైన కార్యక్రమాలను అందిస్తోంది.

నెచ్చెలికి ప్రియుడు తోడుండగా స్టార్‌లైట్ నైట్‌లో చల్లని వాటర్‌పూల్ సమీపంలో వెచ్చని కాఫీ తాగుతుంటే ఎలా ఉంటుంది...? ప్రేమ అనుభవం మంచి కాఫీ రుచిలా ఉండదూ... ఇలాంటి అనేక సౌకర్యాలను తాజ్ బంజారా ఏర్పాటు చేస్తోంది.

24 గంటలూ కాఫీ షాపు, దేశవిదేశీ వంటకాలు ప్రేమికులను పలుకరిస్తాయి. తీయనైన వంటకాలను సేవిస్తూ... తీపి కబుర్లు చెప్పుకుంటూ గడిపే ప్రేమికులను మంద్ర స్వరంలో వహిదా పాటలు మరోలోకంలోకి తీసుకువెళతాయి. ఇలా ప్రేమ స్వర్గంలోకి తీసుకెళ్లే ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది తాజ్ బంజారా.

ప్రేమికుల రోజునాడు పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయదలచుకున్నవారు ముందుగానే తమ టేబుల్ ను అడ్వాన్స్‌గా బుక్ చేసుకోమంటోంది తాజ్ బంజారా. ఇక ప్రేమికులదే ఆలస్యం....

వాలెంటైన్ డే పార్టీని ప్రేమికులు, స్నేహితుల మధ్య తాజ్ కృష్ణ ఫిబ్రవరి 14న డ్రామా లాంజ్‌లోని ఎమరాల్డ్ హాల్ మరియు అహాలలో నిర్వహించనుంది. టికెట్లకోసం 040 6666 2323ని సంప్రదించవచ్చు. ఆర్డర్లపై స్పెషల్ కేకులు, చాక్లెట్లు పొందవచ్చు. మీ ప్రేమ హృదయాన్ని మరింత ఆనందంలో ముంచెత్తడానికి సిద్ధంకండి మరి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
మరిన్ని
యెంకి వంటి పిల్ల లేదోయ్.. లేదోయ్..!!
ప్రేమ భావానికి అక్షరాభిషేకం
ప్రేమకు ప్రశ్నలుండవు
ప్రియురాలికి ఎన్ని ముద్దులో....
ప్రియా... నీకు ముద్దెట్టా పెట్టాలో...!!
శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా...