ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హైటెక్ వస్తువులతో దంపతుల మధ్య పెరిగిన దూరం
బ్లాక్ బెర్రీలు, చేతిలో ఇమిడే గేమ్స్ కన్సోల్స్ మరియు ల్యాప్‌టాప్‌లు వంటి హైటెక్ వస్తువులు బ్రిటిష్ దంపతుల సెక్స్ జీవితాలను దెబ్బతీస్తున్నట్లు ఇటీవల పరిశోధన తెలిపింది. ఈ సర్వేను నిర్వహించిన స్లీప్ కౌన్సిల్ సంస్థ, దంపతులలో నాలుగో వంతు ప్రతిరోజు విడిగా నిద్రిస్తున్నారని తెలిపింది. బ్రిటిష్ బెడ్‌రూమ్‌లు పూర్తిగా హైటెక్ మయం అవుతుండడమే ఇందుకు కారణమని ఈ అధ్యయనం పేర్కొంది.

ఇప్పటికే బ్రిటన్‌లో 9 శాతం దంపతులు ఒంటరిగానే నిద్రిస్తుండగా, 16 శాతం మంది కనీసం నెలకు ఒకసారైనా వేరు పడకలలో నిద్రిస్తున్నారట. ఈ సర్వేలో పాల్గొన్న 1400 మంది వివిధ వయస్సుల దంపతుల్లో పదింట ఎనిమిది మంది తమ బెడ్ రూముల్లో కనీసం ఒక హైటెక్ వస్తువును అయినా ఉంచుకున్నారని సర్వే తెలిపింది.

వారంలో 24 గంటలూ మేల్కొని ఉంటున్న మన సమాజంలో, ఇంటర్నెట్ యాక్సెస్, మొబైల్ ఫోన్లు, బ్లాక్ బెర్లీలు వంటి ఆధునిక సౌకర్యాలతో పడుకునే సమయంలో మరింత బిజీగా గడుపుతున్న దంపతులతో బ్రిటన్ దంపతులు విలసిల్లుతున్నారని ఈ సర్వే తెలిపింది. నిద్రపోవడానికి గాను లైట్లు ఆర్పే ముందు వరకు మొబైల్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను దంపతులు ఉపయోగిస్తున్నారు.

పరుపు మీద పడుకుని టివి చూస్తున్నప్పుడు, ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్‌ సైట్లను చూస్తున్నప్పుడు, ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు తమకు ఏమాత్రం అంతరాయం కలిగించవద్దని ముఖ్యంగా యువ దంపతులు తమ భాగస్వాములకు ఖరాఖండీగా చెప్పేస్తున్నారట.

ముక్తాయింపు ఏమిటంటే, తమ సొంత బెడ్‌పైనే మరింత గాఢంగా నిద్రపోతున్నామని చెబుతున్న ఈ యువదంపతులు అందువల్ల తమ మధ్య సంబంధం దూరమైపోతోందని అర్థం చేసుకోరాదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట.
మరిన్ని
రోజులో తల్లితండ్లులు కలిసే సమయం 15 నిముషాలే
గర్భిణీ స్త్రీలకు కుటుంబ సహాయం అతి ముఖ్యం
సృష్టికే అపురూపం అమ్మతనం
గర్భిణీలకు వ్యాయామం తప్పనిసరి
ముస్లిం మహిళలకు వక్ఫ్‌బోర్డు అండ
మహిళల హక్కల సంరక్షణే ఇస్లాం లక్ష్యం: మధాని