ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆసియా మహిళలే అమెరికా జాతికి మూలం...
ఆసియానుంచి దాదాపు 20 వేల సంవత్సరాల క్రితం వలస వచ్చిన ఆరుగురు మహిళల వారసులే ఉత్తర అమెరికా ఆదివాసీ ప్రజలకు మూలం అంటూ తాజా డిఎన్ఎ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మూలవాసీ అమెరికా ప్రజలలో దాదాపు 95 శాతం మంది ఈ ఆరుగురి మహిళల డిఎన్ఎ వారసత్వాన్ని ఇప్పటికీ కలిగి ఉన్నారని పరిశోధకులు తేల్చి చెప్పారు.

అయితే చరిత్రలో మొట్టమొదటి సారిగా ఆసియా నుంచి అమెరికాకు వలస వచ్చిన జనాభా మొత్తాన్ని ఈ ఆరుగురు మహిళలే పెంచి ఉంటారని దీని అర్థం కాదని ఈ తాజా డిఎన్ఎ అధ్యయనం సహ రచయిత యూగో పెరెగో చెపుతున్నారు. కాలాన్ని ఖచ్చితంగా నిర్ధారించలేకపోయినా 18 నుంచి 21 వేల సంవత్సరాల క్రితం ఈ ఆరుగురు మహిళలూ ఆసియా ఖండంలో జీవించి ఉండేవారని ఈ అధ్యయనం పేర్కొంటోంది.

మానవ వంశ వృక్ష క్రమాన్ని నిర్ధారించే డిఎన్ఎ, మైటోకాండ్రియా అనే కణాల శక్తి కేంద్రాల్లో ఉంటుంది. న్యూక్లియస్‌లో ఉండే డిఎన్ఎ లాగా కాకుండా మైటోకాండ్రియా డిఎన్ఎ అనేది కేవలం తల్లి ద్వారా మాత్రమే సంతానానికి, తర్వాత తరాలవారికి సంక్రమిస్తుంది. దీని ఆధారంతో ఎవరైనా ఒక వ్యక్తి వంశవృక్షాన్ని పేర్చడానికి మొదట అతడి తల్లి మూలాన్ని తర్వాత ఆ తల్లి యొక్క తల్లి మూలాన్ని కనుగొంటే చాలని పరిశోధకుల సూత్రీకరణ.

ఆరకంగా నేటి ఆదివాసీ అమెరికన్లలో కనబడే విభిన్న రకాల మైటోకాండ్రియా డిఎన్ఎ వంశవృక్షం జాడను కనుగొనే ఒక కుటుంబ వంశ వృక్షాన్ని పరిశోధకులు సృష్టించారు. ఈ వంశ వృక్షంలోని ప్రతి శాఖలో మ్యుటేషన్లను -పరిణామక్రమాలు- గుర్తించి అలాంటి పరిణామాలు తరచుగా ఎలా సంభవిస్తున్నాయో తెలుసుకునేందుకు గాను ఒక సూత్రాన్ని వీరు అన్వయించారు. ఈ అన్వయం ద్వారా వంశవృక్షంలోని ఒక్కో శాఖ వయసు ఎంత ఉంటుందో శాస్త్రీయంగా లెక్క గట్టారు. ఈ ప్రతి శాఖ ఒకే ఒక మహిళ ద్వారా పుట్టిందని, ఆ మహిళ మూలం ఆసియా ఖండంలో ఉందని వారు కనుగొన్నారు.

ఈ పరిశోధనలు ఎలా ఉన్నా, ఆసియా ఖండ 'మూలపుటమ్మ'లే అలనాటి అమెరికా ఆదివాసీ జాతికి మూలం అని సైన్స్ నిర్ధారించడం విశేషం.
మరిన్ని
హైటెక్ వస్తువులతో దంపతుల మధ్య పెరిగిన దూరం
రోజులో భార్యాభర్తలు కలిసుండేది 15 నిముషాలే
గర్భిణీ స్త్రీలకు కుటుంబ సహాయం అతి ముఖ్యం
సృష్టికే అపురూపం అమ్మతనం
గర్భిణీలకు వ్యాయామం తప్పనిసరి
ముస్లిం మహిళలకు వక్ఫ్‌బోర్డు అండ