ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మణిపూర్‌లో ప్రజలను అలరించిన ఫ్యాషన్ షో
తీవ్రవాదంతో అట్టుడుకిపోతున్న మణిపూర్ ప్రజలను ఇటీవల జరగిన ఒక ఫ్యాషన్ షో కాస్త ఉపశమనం అందిస్తూ విజయవంతమైంది. రాజధాని ఇంపాల్‌లో జరిగిన బ్లూ ఓషన్ ఫ్యాషన్ అకాడెమీచే నిర్వహించబడిన ఫ్యాషన్ షో అక్కడి ప్రజలు శాంతి ఫలాలను అనుభవించడానికి, సాధారణ జీవితం గడపడానికి ఒక చక్కటి మార్గాన్ని ప్రదర్శించింది.

దుస్తుల రూపకల్పన, మోడలింగ్ రంగాల్లో టాలెంట్‌ను ప్రదర్శించేందుకు వేదికను అందించిన బ్లూ ఓషన్, మణిపూర్‌లోని సుప్రసిద్ధ డిజైనింగ్ సంస్థల్లో ఒకటిగా పేరుగాంచింది. ఇటీవలే అది సాంప్రదాయికమైన మరియు చేనేత దుస్తులతో ఒక చక్కటి ఫ్యాషన్ షోను రూపొందించింది.

ట్రౌజర్, ప్యాంట్స, జీన్స్, జాకెట్స్, కోట్‌లు మాత్రమే ఫ్యాషన్ కాదని సంప్రదాయం కూడా దానిలో ఇమిడి ఉందని ఈ షో నిరూపించిందని బ్లూ ఓషన్ అకాడెమీ అధిపతి బిర్జిత్ చెప్పారు. సాంప్రదాయ దుస్తులు, చేనేత దుస్తులు, డిజైనర్ దుస్తులు కూడా ఫ్యాషన్ పరిశ్రమకు పునాదిగా ఉంటాయని మేం ఈ షో ద్వారా నిరూపించదలిచామని బిర్జిత్ తెలిపారు.

ఇరవై మూడు మంది యువ మోడల్స్, డిజైనర్లు ప్రత్యేకించి తమకోసమే రూపొందించిన సాంప్రదాయ చేనేత దుస్తులు ధరించి షోలో పాల్గొన్నారని ఓషన్ షో అధిపతి పేర్కొన్నారు.

ఈ అకాడమీ ఫ్యాషన్ డిజైనింగ్‌లో కూడా యువతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మొత్తం మీద మణిపూర్ ప్రజలకు ఈ సాంప్రదాయిక ఫ్యాషన్ షో మండువేసవిలో పన్నీరు జల్లులా సేద తీర్చింది అనడంలో సందేహమే లేదు కదా...
మరిన్ని
ఆసియా మహిళలే అమెరికా జాతికి మూలం...
హైటెక్ వస్తువులతో దంపతుల మధ్య పెరిగిన దూరం
రోజులో భార్యాభర్తలు కలిసుండేది 15 నిముషాలే
గర్భిణీ స్త్రీలకు కుటుంబ సహాయం అతి ముఖ్యం
సృష్టికే అపురూపం అమ్మతనం
గర్భిణీలకు వ్యాయామం తప్పనిసరి