ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పాలనా పీఠాలపై అతివల భవిత  Search similar articles
పురషాధిక్య ప్రపంచంలో ఇంతవరకూ ఉన్నత పదవులెప్పుడూ వారినే అలంకరిస్తూ వచ్చాయి. కంప్యూటర్ యుగంలో మహిళల సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో సంస్థల పాలనా పగ్గాలను చేజిక్కించుకుంటున్నారు.

కాలానుగుణంగా వస్తున్న మార్పుల్లో భాగంగా మహిళలు అవకాశాలను అందుకుంటున్నారు. వాషింగ్టన్‌కు చెందిన జాన్‌ డెంకర్ అనే ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త జరిపిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి.

ఈ మధ్యకాలంలో వివిధ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యలో భారీగా కోత విధిస్తున్నాయి. భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగా జరిగే మార్పల్లో మహిళలకు పురుషులతో సమానంగా పాలనాపరమైన అవకాశాలు దక్కుతున్నాయి. మేనేజర్లుగా నియమితులవుతున్నారు.

కొన్ని కీలక పదవుల్లో మహిళలు పురుషలకంటే 25 శాతం అధికంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. కంపెనీలు తమ కార్యాలయాలలో లింగభేదం లేకుండా సమాన అవకాశాలు కల్పించడానికి ఈ మార్పులు ఉండవచ్చునని భావిస్తున్నారు.

కొన్ని స్థాయిల్లో మహిళలు పురుషకంటే చాలా వేగంగా పదోన్నతులు అందుకుంటున్నారు. పురుష మేనేజర్ల కంటే మహిళలే సంస్థకు విధేయతగా ఉంటారని కంపెనీలు యోచిస్తున్నాయని జాన్‌ డెంకర్ అంటున్నారు. 1967-93తో పోల్చితే ప్రస్తుతం పాలనా పగ్గాలు పట్టిన మహిళల శాతం 24 నుంచి 36 శాతానికి పెరిగింది.

కాని అత్యధికంగా జీతం తీసుకునే వారి సంఖ్యలో పెద్ద మార్ప కనిపించడం లేదు. 26 యేళ్ళ చరిత్రలో ఇది 6 శాతం పెరుగుదల మాత్రమే ఉంది. కార్పోరేట్ నిచ్చెన లెక్కడంలో కూడా మహిళలకు మంచి అవకాశాలే లభిస్తున్నాయి.
మరిన్ని
తొలి మహిళా ప్రధాని సిరిమావో బండారునాయకే
వ్యాపార లావాదేవీలలో మహిళలే 'మహరాణులు'
మహిళల తలపుల్లో షాపింగ్‌కే ప్రాధాన్యం
కవల పిల్లల పెంపకంలో జాగ్రత్తలు
ఉపాధ్యక్ష పదవి రేసులో కరోలిన్ కెన్నడీ?
ఉపాధ్యక్ష పదవిపై కన్నేసిన హిల్లరీ