సాధారణంగా ఖరీదైన హ్యాండ్ బ్యాగులను లెదర్‌తో తయారు చేస్తారు. వీటి ధర మహా అయితే వేల రూపాయల్లో ఉంటుంది. అయితే లండన్‌లో 83 లక్షల రూపాయల విలువ చేసే హ్యాండ్ బ్యాగును తయారు చేశారు. ఏమిటీ.. అని ఆశ్చర్య పోతున్నారా? లేక దేనితో తయారు చేశారని అనుకుంటున్నారా? లెదర్‌తో మాత్రం కాందండీ. స్వచ్ఛమైన వజ్రాలతో తయారు చేశారు.
తొమ్మిది సెంటీమీటర్ల ఎత్తు, 14 సెంటీమీటర్ల పొడవు గల ఈ బ్యాగులో రెండు వేల వజ్రాలను ఉపయోగించారు. అవసరం అనుకుంటే బ్యాగు బెల్టును నెక్లెస్‌గా కూడా ఉపయోగించుకునేలా రూపొందించారు. లండన్‌లోని వివిధ ప్రదర్శనల్లో ఉంచుతున్న ఈ బ్యాగును త్వరలోనే వేలం వేయనున్నారు. ఈ వేలంలో బ్యాగు ధర కోటి రూపాయల మేరకు పలుకవచ్చని బ్యాగు తయారీదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
|