టైప్ 2 మధుమేహం మరియు హృద్రోగం కలిగిన మహిళలు సాధారణంగా తక్కువ నియంత్రణ శక్తిని కలిగి ఉన్నారని పురుషులతో పోలిస్తే వీరు తక్కువ వైద్య చికిత్సను తీసుకుంటున్నారని మూడు జర్మన్ యూనివర్శిటీలు నిర్వహించిన కొత్త అధ్యయనం తెలిపింది.
టైప్ 2 డయాబెటిస్ కలిగిన మహిళలతో పోలిస్తే, మధుమేహం కలిగిన పురుషులల్లో హృద్రోగం కారణంగా సంభవించే మరణాలు తక్కువగా ఎందుకుంటున్నాయనే విషయంపై ఈ తాజా పరిశోధన వెలుగు ప్రసరిస్తుందని కోలొన్ యూనివర్శిటీలో మెడిసన్ ప్రొఫెసర్, ఈ అధ్యయనం ప్రధాన రచయిత లోనా గౌని-బెర్త్‌హోల్డ్ చెప్పారు. రక్తపోటు, బ్లడ్ సుగర్, కోలెస్ట్రాల్ స్థాయిలకు సంబంధించి పురుషులతో పోలిస్తే స్త్రీలు చాలా తక్కువ నియంత్రణ శక్తిని కలిగి ఉన్నారని బెర్తోల్డ్ చెప్పారు.
మధుమేహం కలిగిన రోగులలో గుండెవ్యాధికి సంబంధించిన వ్యాధి నియంత్రణ మరియు చికిత్సలకు సంబంధించి స్త్రీపురుషులలో స్పష్టంగా వ్యత్యాసం కనబడుతోందని ఆమె చెప్పారు. బాన్, హాంబర్గ్ వర్శిటీలకు చెందిన గౌని-బెర్తోల్డ్ మరియు పరిశోధకులు టైప్-2 మధుమేహం కలిగిన దాదాపు 45 వేలమంది ప్రజలను అవుట్ పేషెంట్లుగా తీసుకుని 2002-2003లో అధ్యయనం చేశారు. వీరిలో 9,521మంది పురుషులకు, 8.050 మంది మహళలకు గుండె మరియు వాస్క్యులర్ వ్యాధి ఉన్నట్లు కనుగొ్న్నారు.
అయితే గుండెవ్యాధి లేని డయాబెటిక్ రోగులలో ఎలాంటి లింగబేదం కనిపించలేదని ఈ అధ్యయనం చెప్పింది. మరోవైపున గుండెవ్యాధి కలిగిన విభాగంలో పురుషులకంటే 44 శాతం ఎక్కువగా స్త్రీలకు అధిక కొలెస్ట్రాల్ ఏర్పడే అవకాశం ఉందని తేలింది. అలాగే పురుషులకంటే స్త్రీలలోనే 19 శాతం కంటే ఎక్కువగా అధిక రక్తపోటు ఉందని ఈ అధ్యయనం తేలింది.
అలాగే రక్తంలో గ్లూకోజ్ నిల్వ స్థాయికి సంబంధించి దీర్ఘ కాలిక నియంత్రణ స్థాయి ప్రమాణాలు పురుషులతో పోలిస్తే స్త్రీలలో 15 శాతం తక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనం తేల్చిచెప్పింది. మొత్తం మీద చూస్తే గుండెవ్యాధికి సంబంధించిన ప్రమాదాన్ని తగ్గించే అవకాశాన్ని మహిళల్లో మధుమేహం తగ్గిస్తోందని గౌన్ బెర్తోల్డ్ ప్రకటించారు.
|