ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఉద్యోగం పోయిందా... బ్యూటీ ప్యార్లల్ ఉందిగా...  Search similar articles
Raju
అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల, అమెరికాలో గృహ రుణ సంక్షోభాలు వంటి కారణాలతో పాశ్చాత్య దేశాల్లో ప్రత్యేకించి అమెరికాలో వేలాదిమంది ప్రతినెలా ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నప్పటికీ కాస్మెటక్ సర్జరీపై ప్రజల ఆదరణ ఏమాత్రం తగ్గలేదని తాజా అధ్యయనం తెలిపింది.

ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ఉద్యోగాలు కోల్పోతున్న స్త్రీ పురుషులు సమయం దొరికిందే చాలన్న విధంగా శరీర సౌందర్యంకోసం పరువులెత్తుతున్నారని ఈ అధ్యయనం తెలిపింది. అమెరికాలో మాంద్య పరిస్థితులు భయం గొలుపుతున్నప్పటికీ సాధారణ కాస్మెటిక్ సాధనాలైన బోటోక్స్ ఇంజెక్షన్‌ల కోసం ప్రజల వెంపర్లాట మరింత పెరిగిందని అమెరికన్ సొసైటీ ఫర డెర్మటాలజిక్ సర్జరీ -ఎస్‌డిఎస్- సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.

ఇప్పటికే ఉన్న ఉద్యోగాలు కోల్పోయిన వారు తదుపరి ఉద్యోగాలు వెతుక్కునే ముందు చూడడానికి ఇంపుగా ఉండే ముఖ వర్చస్సుకోసం కాస్మటిక్ ఉత్పత్తులపై మక్కువను బాగా పెంచుకుంటున్నారని ఈ అధ్యయనం తేలిపింది. దీంతో మాంద్య పరిస్థితుల్లోనూ కాస్మెటిక్ సర్జన్ల పంట పండుతోందని, వీరికి కొత్త రకం క్లయింట్లు తోడవుతున్నారని పేర్కొంది.

ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజల ఆదాయవనరులు గతంతో పోలిస్తే క్షీణించినప్పటికీ, వీరిలో చాలామంది తమ ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఆరాటపడుతున్నారని ఏఎస్‌డిఎస్ అధ్యక్షుడు డారెల్ రీగెల్ చెప్పారు. ఈ సంస్థకు చెందిన 562 మంది సభ్యులను ఆన్‌లైన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు సౌందర్య సాధనకు సంబంధించిన క్లయింట్ల బుకింగ్‌లు పెద్దస్థాయిలో వీరికి వస్తున్నట్లుగా తేలింది.

ఆరునెలలకు ముందు పరిస్థితితో పోలిస్తే తమకు 32 శాతం మంది కొత్త పేషెంట్లు తమ వద్ద అపాయింట్‌మెంట్లు తీసుకున్నారని, దీంతో తమ క్లయింట్ల వృద్ధిరేటు 30 శాతానికి పెరిగిందని ఈ సర్వేలో కాస్మొటిక్ సర్జన్లు చెప్పారు. అయితే కాస్మెటిక్ మెరుగుదల విభాగంలోనే కాకుండా సాధారణ ప్రజానీకం కూడా ప్రత్యేకించి ఇటీవలే నిరుద్యోగులుగా మారిన వారు సైతం కాస్మెటిక్ సర్జన్లపట్ల ఆసక్తి పెంచుకుంటున్నారని రీగెల్ చెప్పారు.
1 | 2  >>  
మరిన్ని
వ్యాయామంతో బొద్దు మహిళల ఆకలి తగ్గదు
ఇజ్రాయిల్ ఉక్కు మహిళ గోల్డా మెయిర్
డయాబెటిక్ మహిళల్లో వ్యాధి నియంత్రణ శక్తి తక్కువ
వజ్రాలు పొదిగిన హ్యాండ్ బ్యాగు  
తొలి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపాలాని
పాలనా పీఠాలపై అతివల భవిత