ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లిప్‌స్టిక్, హై హీల్స్ వేసుకుంటే అత్యాచారాలా...!!?  Search similar articles
WD
మలేసియాలోని మహిళలు లిప్‌స్టిక్, ఎత్తు మడాల చెప్పులు ( హై హీల్స్) వేసుకోకూడదని మలేసియా మునిసిపల్ కౌన్సిల్ ఓ వింత ఉత్తర్వును జారీ చేసింది విషయం. వివరాలలోకి వెళితే... మహిళలు అందంగా తమ పెదవులకు వేసుకునే లిప్‌స్టిక్, కాళ్లకు ధరించే హై హీల్స్ వల్లనే అత్యాచారాలు పెరుగుతూ పోతున్నాయంటున్నది కౌన్సిల్.

ఈ అఘాయిత్యాలను తగ్గించటానికంటూ... మహిళలు లిప్‌స్టిక్, ఎత్తు మడాలు చెప్పులు వేసుకోరాదని ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ముఖ్యంగా మలేసియా షాపుల్లో పనిచేసే మహిళా సేల్స్ ప్రమోటర్లు ఇటువంటి అలంకారాలను చేసుకుని వీధుల్లో తిరగరాదని నిబంధన పెట్టింది. తమ నిర్ణయం మహిళల ఆత్మగౌరవాన్ని పెంచుతుందని చెప్పుంటోంది. అయితే ఈ ఉత్తర్వుపై మలేసియా మహిళలు తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చుతున్నారు.

ముఖానికి విపరీతంగా మేకప్ చేసుకునే తిరిగే మహిళలల విషయంలో ఈ నిబంధన సరైనదేనేకానీ, సాధారణ స్థాయిలో మేకప్ చేసుకునే వారిపట్ల ఇది సరైంది కాదని సేల్స్ ప్రమోటర్లుగా పనిచేస్తున్న మహిళలు ధ్వజమెత్తుతున్నారు. కనీసం సహజసిద్ధమైన లిప్‌స్టిక్ వేసుకోవడానికైనా అనుమతించాలని వారు కోరుతున్నారు.
మరిన్ని
బ్రిటన్‌లో మైనారిటీలుగా మారిన దంపతులు
బాలికా కార్మికుల జీవితంలో వెలుగురేఖలు...
ఉద్యోగం పోయిందా... బ్యూటీ ప్యార్లల్ ఉందిగా...
వ్యాయామంతో బొద్దు మహిళల ఆకలి తగ్గదు
ఇజ్రాయిల్ ఉక్కు మహిళ గోల్డా మెయిర్
డయాబెటిక్ మహిళల్లో వ్యాధి నియంత్రణ శక్తి తక్కువ