వయసు మీరే కొద్దీ దంపతులు పడకగదిలో సుఖపడే రోజులకు కాలం చెల్లుతుందని లోక వ్యవహారం... కానీ, వయసు మళ్లిన వారిని గేలిచేసే ఈ పప్పులిక ఉడకవు అని తాజా పరిశోధన మొట్టికాయలు వేస్తోంది మరి. సెక్స్ అనేది ద్రాక్ష సారాయిలా, ఫ్రెండ్‌షిప్‌లా వయసు పెరిగే కొద్దీ మరింత వినూత్నంగా తయారవుతుందని ఈ పరిశోధన తేల్చి చెబుతోంది.
బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురింపబడిన ఈ అధ్యయనం ప్రకారం 70 ఏళ్లు నిండిన వారు సైతం తరచుగా సెక్స్‌లో పాల్గొంటూ సంతృప్తి పొందుతున్నారని తేలింది. ఈ వయసులోని మహిళలయితే మరీ ప్రత్యేకంగా తమ లైంగిక జీవితం పట్ల సంతృప్తికరంగా ఉంటున్నారట.
ఈ పరిశోధనలో తేలిన మరొక అంశమేదంటే ముసలివారిలో అంటే 70 ఏళ్ల వయసు కలిగిన వారిలో లైంగిక ప్రవర్తన గురించిన జ్ఞానం పరిమితంగా ఉంటోందట. కానీ, లైంగిక సమస్యల పట్ల ఈ వయసులో ఉన్నవారు చూపు సారిస్తున్నారు. ఈ అధ్యయనం కోసం గాను స్వీడన్‌లో 1500 మంది ప్రజలను ఇంటర్వ్యూ చేశారు. | | మొత్తం మీద ఈ అధ్యయనం ప్రకారం లైంగిక జీవితం, దానితో ముడిపడిన అనుభూతులు ముసలితనంలోనూ సహజక్రమంగా ఉంటాయని వృద్ధుల్లో చాలామంది భావిస్తున్నారని తేలింది. |
| |
లైంగిక అసమర్థత, వైవాహిక జీవితంలో సంతృప్తి, లైంగిక కార్యకలాపాలు వంటి తమ లైంగిక జీవితానికి సంబంధించిన పలు విభిన్న అంశాలను గురించి ప్రశ్నలడిగారు. 70 ఏళ్లు నిండిన వృద్ధులను నాలుగు విభిన్న కాలాల్లోంచి ఎంపిక చేసుకున్నారు. 1971-72, 1976-77, 1992-03, 2000-01 సంవత్సరాల్లో 70 ఏళ్ల వృద్ధుల లైంగిక జీవితాలను విచారించారు.
ఈ ఇంటర్వ్యూ ప్రకారం 70 ఏళ్ల వయసు మీరిన వివాహిత పురుషుల్లో లైంగిక కార్యకలాపం 30ఏళ్ల క్రితం నాటితో పోలిస్తే ప్రస్తుతం 52 నుంచి 68 శాతానికి పెరిగిందని, అదే వయసు కలిగిన వివాహిత మహిళల్లో 30 నుంచి 54 శాతం పెరిగిందని తేలింది. అదే అవివాహిత మహిళల్లో లైంగిక కార్యకలాపాలు 0.8 నుంచి 12 శాతానికి పెరుగుదల సాధించాయని అధ్యయనం స్పష్టంచేసింది.
ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే మహళలు వయసు మీరేకొద్దీ వారిలో లైంగిక సంతృప్తి తారాస్థాయికి చేరుకుందని ఈ సర్వే తెలిపింది. ఈ వయసులోనూ సెక్స్‌లో గడిపినప్పుడు రతిలో తాదాత్మ్యతకు లోనయ్యామని మహిళలు తెలిపారు. తమకురతిలో తాదాత్మ్యత కలుగలేదని చాలా తక్కువ మంది మహిళలు చెప్పారు.
ముదిమి వయసులో సెక్సులో తక్కువ సంతృప్తి కలుగుతోందని చెప్పే మహిళల సంఖ్య ఈ 30 ఏళ్లలో తగ్గుముఖం పడుతుండగా, తాము పెద్దగా సుఖపడలేకపోతున్నామని చెప్పే పురుషుల సంఖ్య పెరిగింది. ఈ కారణంగా లైంగిక విషయాల్లో పురుషులు విఫలం అవుతున్నామని చెప్పడాన్ని ఆమోదించవచ్చని సర్వే తెలిపింది.
|