ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తొలి ప్రేమను తిరిగి గుర్తుంచుకుంటే ప్రమాదం..  Search similar articles
Raju
జీవితంలో ప్రేమించిన లేక ప్రేమలో పడ్డ తొలి క్షణాలు చాలా ప్రగాఢంగా ఉంటాయి కాబట్టి వాటిని మళ్లీ పొందాలని ప్రయత్నిస్తే ప్రస్తుతం వారు కొనసాగిస్తున్న సంబంధాలు దారుణంగా దెబ్బతింటాయని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

తొలిసారిగా మనం ప్రేమించిన లేదా ప్రేమలో పడ్డ ఆ మహత్తర క్షణాలు ఎన్నాళ్లయినా మనస్సులో జ్వలిస్తూ ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే.. ఆ మధుర జ్ఞాపకాలు గుర్తుకు వస్తే ఎంత మహామహులైనా తలక్రిందులు కాక తప్పదు.

తొలినాటి ప్రేమ జ్వాలలు గుర్తుకొచ్చినప్పుడల్లా మనసును దహిస్తాయి కాబట్టి చిన్ననాటి మన ప్రేమికులు, ప్రేమికురాళ్ల కోసం తిరిగి వెతుకలాట మొదలెట్టినా, లేక వారితో తిరిగి స్నేహ సంబంధాల కోసం ప్రయత్నించినా మన ప్రస్తుత జీవితానికి కలిగే దెబ్బను పూడ్చుకోలేమని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తొలి ప్రేమతో చేటు...
  బాల్యంలో ప్రేమలో పడ్డవారి ప్రేమానుభూతులను శైశవ హర్మోన్లు మనుషుల మెదళ్లలో దశాబ్దాల తర్వాత కూడా భద్రంగా పదిలపరుస్తాయని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. పోగొట్టుకున్న ప్రేమికుడి, ప్రేమికురాలి స్వరం, స్పర్శ తిరిగి ఆ అనుభవం కావాలి అంటూ ప్రేరేపిస్తుందట..      


కౌమార జీవితంలో తారసించిన తొలి ప్రేమను తిరిగి పొందాలని చూస్తే కోలుకోలేని దుష్ఫలితాలను అనుభవించవలసి వస్తుందని, చివరకు ప్రస్తుతం తాము సాగిస్తున్న వివాహ సంబంధాలు దెబ్బతినడమే కాక, జీవితమే విధ్వంసమయ్యే ప్రమాదముందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.

ఒకనాటి జీవితంలో తొలి ప్రేమను పంచి పెట్టిన వ్యక్తులు మనకు తారస పడితే, వారితో పాత జ్ఞాపకాలనే కాక పాత స్నేహ సంబంధాలను కూడా తిరిగి నెలకొల్పుకోవాలని ప్రయత్నిస్తే ప్రమాదం అక్కడే పొంచి ఉందని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ సైకాలజిస్ట్ నాన్సీ కాలిస్ అంటున్నారు. ఇటువంటి సంబంధాలను ఆమె గత 14 సంవత్సరాలుగా అధ్యయనం చేస్తున్నారు.

తొలి ప్రేమ దివ్యక్షణాలను అందించిన వారిని తిరిగి తదుపరి జీవితంలో కలుసుకునే అవకాశం వచ్చినట్లయితే అది అంతటితో ఆగిపోదని నాన్సీ అంటున్నారు. అది ఫో‌న్ కాల్‌తో మొదలై హోటల్ వరకు వెళ్లుతుందని తర్వాతి పరిణామాలు శరవేగంతో సాగిపోతాయని ఆమె చెబుతున్నారు.
1 | 2  >>  
మరిన్ని
ప్రపంచంలో అత్యంత వృద్ధ బ్లాగర్ మహిళే...
సెక్సుకు వయసొక అడ్డు కాదు.....ట
టీవీ వీక్షణంతో ఊబకాయం షురూ..
సమాచార సేకరణలో మహిళలే మిన్న...
లిప్‌స్టిక్, హై హీల్స్ వేసుకుంటే అత్యాచారాలా...!!?
బ్రిటన్‌లో మైనారిటీలుగా మారిన దంపతులు