ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మహిళల్లోనే ఆశావాదం పాలు అధికం....  Search similar articles
వయసు మీరే కొద్దీ పురుషులతో పోలిస్తే మహిళలే మరింత ఆశావాదులుగా ఉంటూ, సంతోషకరమైన జీవితం గడుపుతున్నారని తాజాగా ఓ అధ్యయనం తెలిపింది. 50 ఏళ్ల వయసు దాటిన 9,800 మందిపై సాగించిన సర్వే ఫలితాలను లండన్‌లో తాజాగా విడుదల చేశారు. తమ కుటుంబాల బాగోగులను పట్టించుకోవడం గురించి మహిళలు పెద్దగా ఆందోళన చెందకపోవడం వల్లే వారు పురుషులకంటే సంతోషకరంగా ముదిమి వయస్సులో గడుపుతున్నారని ఈ తాజా సర్వే బయటపెట్టింది.

తమ జీవితాల గురించి స్త్రీ పురుషుల ఆలోచనల్లోనే తేడా ఉంటున్నందున, పెద్దగా వ్యత్యాసం లేని అంశాలతోనూ వారు ప్రభావితం అవుతున్నారని ఈ అధ్యయనం సహ రచయిత్రి డాక్టర్ ఎలిజబెత్ బ్రీజ్ పేర్కొన్నారు.

ఉద్యోగం, పని లేని ఇతరుల సంరక్షణా బాధ్యతను స్వీకరించవలసి రావడం పట్ల మహిళలు వ్యతిరేక దృక్పధం కలిగి ఉంటున్నారని ఎలిజబెత్ తెలిపారు. అయితే తమ పిల్లల, కుటుంబ బాగోగులను ఎక్కువగా చూసుకునే కొద్దీ, మహిళలలో సానుకూలత శాతం పెరుగుతోందని ఆమె చెప్పారు.

ఈ సర్వే కోసం 1952 కంటే ముందు జన్మించిన వారిని ఇంటర్వ్యూ చేశారు. లండన్ యూనివర్శిటీ కాలేజ్ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం, సంపద కలిగిన ప్రజలు నిరుపేదల కంటే ఎక్కువకాలం జీవిస్తున్నారని కనుగొంది. సంపద కలిగిన వారితో పోలిస్తే నిరుపేదలు రెండు రెట్లు ఎక్కువగా అల్పవయస్సులోనే జీవిస్తున్నారని ఈ అధ్యయనం తేల్చింది.

కొన్ని వయో బృందాల వారిలో ఈ వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉంది. 60 నుంచి 74 ఏళ్ల పరిధిలో ఉన్న నిరుపేద మహిళలు అదే వయసు సంపన్న మహిళల కంటే ఎక్కువగా చనిపోతున్నారని ఈ సర్వే చెప్పింది.

మహిళల్లో పెళ్లి చేసుకున్న వారు, డిగ్రీ వరకు చదువుకున్నవారు, ప్రొఫెషనల్‌గా ఉన్నవారు ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఉన్నాయని కూడా ఈ సర్వే పేర్కొంది. వివాహితులు లేదా భాగస్వాములతో జీవించేవారితో పోలిస్తే ఒంటరి జీవితం గడుపుతున్న వారు రెండు రెట్లు ఎక్కువగా తక్కువ వయస్సులోనే చనిపోతున్నారని సర్వే తెలిపింది.

కాగా, స్త్రీ పురుషులు ఇరువురూ వ్యాయామం చేసిన పక్షంలో శారీరకంగా సత్తువ కోల్పోయిన వారి ఆయుర్దాయం బాగా పెరుగుతోందని సర్వే కనుగొంది. వీరితో పోలిస్తే శారీరక దార్ధ్యత కలిగిన వారు వ్యాయామం చేయని పక్షంలో రెండు రెట్లు ఎక్కువగా మరణిస్తున్నారని సర్వే చెప్పడం గమనార్హం.
మరిన్ని
తొలి ప్రేమను తిరిగి గుర్తుంచుకుంటే ప్రమాదం..
ప్రపంచంలో అత్యంత వృద్ధ బ్లాగర్ మహిళే...
సెక్సుకు వయసొక అడ్డు కాదు.....ట
టీవీ వీక్షణంతో ఊబకాయం షురూ..
సమాచార సేకరణలో మహిళలే మిన్న...
లిప్‌స్టిక్, హై హీల్స్ వేసుకుంటే అత్యాచారాలా...!!?