ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బలవంతపు కాపురం అమానుషం : సుప్రీంకోర్టు  Search similar articles
FileFILE
దంపతుల మధ్య ప్రేమానుబంధం పూర్తిగా నశించినా, ఆ దంపతులచే బలవంతంగా కాపురం చేయించాలని ప్రయత్నించడం క్రూరత్వానికి పరాకాష్ట అని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వివాహ బంధం పూర్తిగా చెదిరిపోయిన తర్వాత కూడా భార్యాభర్తలను కలిసి ఉండాలని బలవంతపెట్టడం క్రూరాతిక్రూరమైన విషయమని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

అన్ని రకాలుగా దంపతుల మధ్య వివాహబంధం విచ్ఛిన్నమైపోయిన తర్వాత, ఆ బంధాన్ని ఇక ఏమాత్రం తిరిగి కుదర్చడం సాధ్యం కాదని తేలిన తర్వాత కూడా ఆ వివాహబంధాన్ని కొనసాగించాలని ప్రయత్నించడమే ఓ క్రూరత్వమని సుప్రీం కోర్టు బెంచ్ న్యాయమూర్తులు అల్టమస్ కబీర్, అఫ్తాబ్ ఆలమ్ స్పష్టం చేశారు.
ఇలాంటి కాపురాలు వద్దు
  ఇష్టం లేని బంధం వివాహ బంధమైనా సరే దాన్ని కొనసాగించడంలోని అనర్థాన్ని, అసందర్భాన్ని కోర్టు సరైన సమయంలోనే గుర్తించడం అభినందనీయం...      


మధ్యప్రదేశ్‌కు చెందిన సతీష్ సిటోలె అతని భార్య మధ్య వైవాహిక బంధం తిరిగి కోలుకోలేనంతగా తెగిపోయినప్పటికీ సతీష్ అతడి భార్యతో కాపురం చేయాలని ఆ రాష్ట్ర హైకోర్డు ఇచ్చిన తీర్పును తోసివేస్తూ అపెక్స్ కోర్టు పైవిధంగా తీర్పు చెప్పింది.

సిటోలె భార్య గంగకు అనుకూలంగా స్థానిక వివాహ వ్యాజ్యాల కోర్టు తీర్పు చెప్పింది. అయితే వీరిరువురి మధ్య న్యాయపరమైన వేర్పాటును ఆదేశిస్తూ వివాహ వ్యాజ్యాల కోర్టు ఇచ్చిన తీర్పును మధ్యప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చింది.
1 | 2  >>  
మరిన్ని
ఆడ మగ తేడాలకు మెదడులోనే బీజం....
మహిళల్లోనే ఆశావాదం పాలు అధికం....
తొలి ప్రేమను తిరిగి గుర్తుంచుకుంటే ప్రమాదం..
ప్రపంచంలో అత్యంత వృద్ధ బ్లాగర్ మహిళే...
సెక్సుకు వయసొక అడ్డు కాదు.....ట
టీవీ వీక్షణంతో ఊబకాయం షురూ..