ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > కొడతారు.. తిడతారు... సెక్స్ కావాలంటారు... ఎలా?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కొడతారు.. తిడతారు... సెక్స్ కావాలంటారు... ఎలా? Search similar articles
WD
శృంగారం ఓ మధురానుభూతిని పంచే ఓ అనుభవం. అందుకే శృంగార రసానికి ఉన్న ప్రాముఖ్యత మరి దేనికీ లేదు. ఒకరికొకరు అర్థం చేసుకుని... ఒకరి బాధ్యతలు మరొకరి పంచుకుని... తోడునీడగా... పాలునీళ్లలా కలిసిపోయే జంటలకు శృంగారం స్వర్గం. అయితే ఈ అనుభవం తమకు నరకాన్ని తలపిస్తుందంటున్నారు పాకిస్తాన్‌లోని చాలామంది మహిళలు. వివరాలలోకి వెళితే...

ఇటీవల పాక్ మహిళలపై దాంపత్యానికి సంబంధించి లండన్‌లోని ఓ పరిశోధక బృందం చేపట్టిన సర్వేలో అత్యంత ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. అదేమంటే.... చాలా మంది మహిళలు తమ భర్తలతో సెక్స్‌లో పాల్గొనడానికి నిరాకరిస్తున్నారట. ఈ ప్రవర్తన వెనక వున్న అసలు కారణం ఏమిటని శోధిస్తే.... వారి వారి భర్తల దుందుడుకు ప్రవర్తనలే సెక్స్ పట్ల అభ్యంతరాలకు కారణమవుతోందని తేలింది.

దాంపత్య జీవితంలో హింసాత్మకమైన సెక్స్‌... అన్న కోణంలో పాక్ మహిళపై అంతర్జాతీయ స్త్రీ రక్షణ సంస్థ ఓ సర్వేను చేపట్టింది. ఈ సర్వేలో దాదాపు 40 మంది ఇంటర్యూలను తీసుకున్నారు. మొత్తం 24 మంది ప్రత్యక్షంగా తమ సెక్స్ అనుభవాలను ఎటువంటి దాపరికం లేకుండా చెప్పారు. మరో పదిమంది సెక్స్ అనుభవంపై మరింత లోతుగా తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు అధ్యయనకారులైన రాఫత్ హుస్సేన్, అడీల్ ఖాన్ వెల్లడించారు.
చితక బాదుతాడు... సెక్స్ కావాలంటాడు...
  నా భర్త శారీరకంగా నన్ను చిత్ర హింసలు పాల్జేస్తాడు. అంత దారుణంగా ప్రవర్తించినందుకు కనీసం క్షమాపణలు కూడా అడగడు. నన్ను తను ఇష్టం వచ్చినట్లు చితకబాదుతాడు... అలా చేసిన రెండు మూడు గంటల్లోనే మళ్లీ సెక్స్ కావాలంటాడు      


సెక్స్ పట్ల పాక్ మహిళ చూపుతున్న తీవ్ర అభ్యంతరానికి అనేక కారణాలు వున్నట్లు వెల్లడైంది. భర్త కోపం, పట్టింపులేని ధోరణి, శారీరకంగా హింసించడం, బలవంతంగా సెక్స్ చేయాలని ప్రయత్నించడం వంటివన్నీ తమ భర్తలపై ఏహ్య భావాన్ని కలిగించేట్లు చేస్తున్నాయని మహిళలు పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో కొందరు మహిళలకు సెక్స్ అనుభవం ఓ భయంకర ప్రక్రియగా మారడంతో శృంగారానికి పూర్తిగా దూరమైపోతున్నట్లు తేలింది.
1 | 2  >>  
మరిన్ని
అమ్మ ఉద్యోగానికి, పిల్లలు ఆఫీసుకు...!
ఊపందుకోని బంగారు నగల కొనుగోలు  
ఆ ఊర్లో అమ్మాయిలు నగలు ధరించరు!
బలవంతపు కాపురం అమానుషం : సుప్రీంకోర్టు
ఆడ మగ తేడాలకు మెదడులోనే బీజం....
మహిళల్లోనే ఆశావాదం పాలు అధికం....