ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > నేపాల్ "కుమారీ"లకు స్వేచ్ఛ!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నేపాల్ "కుమారీ"లకు స్వేచ్ఛ!
FileFILE
మత సంప్రదాయాలకు బందీలై, గడప దాటకుండానే బాల్యాన్ని దుర్భరంగా వెళ్లదీస్తోన్న నేపాల్ చిన్నారి దేవతలు"కుమారీ"లకు స్వేచ్ఛ లభించింది. "సజీవ దేవతలైన కుమారీ"ల హక్కులకు భంగం కలిగించకూడదని నేపాల్ సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది.
కుమారీ"లంటే..?
  నేపాల్ దేశంలో హిందూ, బౌద్ధ మత సంప్రదాయాల ప్రకారం నాలుగేళ్ల ఆడపిల్లలను "కుమారీ"లుగా ప్రకటించి, వారిని దేవతలుగా పూజిస్తారు. బౌద్ధులు వీరిని వజ్రదేవికి ప్రతిరూపంగా భావిస్తే.. హిందువులు కాళికాదేవి అవతారంగా భావిస్తారు. ఈ కుమారీలను రాజులు కూడా పూజించేవారు.      


గత మూడు సంవత్సరాలుగా పెండింగులో ఉన్న ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు కుమారీల హక్కులకు విఘాతం కలిగించకూడదని, వారిని పాఠశాలలకు పంపవచ్చని తీర్పునిచ్చారు. అంతేగాకుండా కుమారీల స్థితిగతులపై ఐదుగురు సభ్యుల కమిటీతో అధ్యయనం చేయించి సంవత్సరంలోపు ఓ స్పష్టమైన నివేదికను సమర్పించాలని నేపాల్ ప్రభుత్వాన్ని ఆదేశించారు.

కుమారీలను కట్టుబానిసలుగా చూడవద్దని, వారి స్వేచ్ఛకు భంగం కలిగించే రీతిలో వ్యవహరించకూడదని ఈ సందర్భంగా న్యాయమూర్తులు స్పష్టం చేశారు. అలాగే.. మాజీ కుమారీల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.
1 | 2  >>  
మరిన్ని
ఒలింపిక్స్‌ : మహిళా గైడ్లకు నగ్న పరీక్షలు
తెలుగింటి ఆడపడచుల "రాఖీ" కోలాహలం
మహిళలు కావడమే శాపమా...!
నైజీరియా మహిళలు చీర కడితే జైలుశిక్షే..!
మహిళ జీవితంలో ఆరేళ్ళు ఇల్లు ఊడ్వడానికే...
ఇంజనీరింగ్ కోర్సుల్లో అమ్మాయిల జైత్రయాత్ర!