ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > మహిళలకు 18 ఏళ్లలోపే తొలి లైంగికానుభవం..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మహిళలకు 18 ఏళ్లలోపే తొలి లైంగికానుభవం..!
FileFILE
భారతదేశంలో పురుషులతో పోలిస్తే... మహిళల్లో ఎక్కువమంది 18 సంవత్సరాల లోపే తొలి లైంగికానుభవాన్ని పొందుతున్నారని ప్రభుత్వ సర్వే ఒకటి వెల్లడించింది. అదే మగవారైతే 23 ఏళ్లలోపు తొలి అనుభవాన్ని పొందుతున్నారని ఆ సర్వే పేర్కొంది.

వివరాల్లోకి వస్తే... జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-3 (ఎన్ఎఫ్‌హెచ్ఎస్ 2005-06) ప్రకారం... పదిహేను నుంచి ఇరవై నాలుగేళ్ల మధ్య వయస్సు ఉన్న పురుషులతో పోలిస్తే... యువతులే ముందుగా సెక్స్‌లో పాల్గొంటున్నారని తెలిపింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే... మహిళలకు తక్కువ వయస్సులోనే వివాహాలు చేయడమే..!

మహారాష్ట్రలోని మహిళల్లో సగం మందికి పైగా 18 ఏళ్ల లోపే శృంగారంలో పాల్గొంటున్నారని పై సర్వే పేర్కొంది. ఈ సర్వేలో భాగంగా... ఆరోగ్యం, పోషకాహారం, విద్య తదితర అంశాలతోపాటుగా లైంగిక ప్రవర్తనపై కూడా సుమారు 2 లక్షల మందిని ప్రశ్నించగా వారిలో ఎక్కువశాతం పైన చెప్పిన అభిప్రాయాలను వ్యక్తపర్చినట్లుగా వెల్లడైంది.

సర్వే వివరాల ప్రకారం... 15 నుంచి 19 ఏళ్ల వయస్సున్న యువతుల్లో 28 శాతం మంది తొలి శృంగారానుభవాన్ని పొందితే... యువకుల్లో ఆ శాతం 11 మాత్రంగా ఉంది. 20 నుంచి 24 ఏళ్ల వయస్సున్న మహిళల్లో ముప్పావుశాతం మంది, పురుషుల్లో సగం శాతం మంది సెక్స్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని
నేపాల్ "కుమారీ"లకు స్వేచ్ఛ!
ఒలింపిక్స్‌ : మహిళా గైడ్లకు నగ్న పరీక్షలు
తెలుగింటి ఆడపడచుల "రాఖీ" కోలాహలం
మహిళలు కావడమే శాపమా...!
నైజీరియా మహిళలు చీర కడితే జైలుశిక్షే..!
మహిళ జీవితంలో ఆరేళ్ళు ఇల్లు ఊడ్వడానికే...