అగ్నిసాక్షిగా మూడుముళ్ళువేసి పెళ్లి చేసుకుని, భార్యలను మోసం చేసి పారిపోయే ఎన్నారై భర్తల్లారా..! ఖబడ్దార్..! ఈ హెచ్చరిక ఏంటబ్బా..! అని ఆలోచిస్తున్నారా..?! ఏం లేదు గానీ.. తాళికట్టి పారిపోయిన మీరు ఎక్కడున్నా, మీ ఆచూకీ తెలుసుకుని శిక్షించేందు కోసం భారత ప్రభుత్వం "యూనిఫాం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ (యుఎంఆర్)" అనే ఒక వినూత్న విధానాన్ని అమలు చేస్తోంది. అందుకే ఈ హెచ్చరిక. | | వివాహం చేసుకునే స్త్రీ పురుషులు యు.ఎం.ఆర్. ఫారంలో తప్పనిసరిగా కొన్ని వివరాలను పొందుపరచవలసి ఉంటుంది. అంతేగాకుండా, కట్నం తీసుకోలేదని వరుడు, ఇవ్వలేదని వధువు సంతకం చేయాల్సి ఉంటుంది. అలాగే, ఇద్దరి మధ్యా ఎలాంటి రక్త సంబంధం లేదని వారు హామీ ఇవ్వాలి... |
| |
ఈ విధానం ప్రకారం స్వదేశంలోగానీ, విదేశాలలోగానీ భార్యలను వదిలేసి, తప్పించుకు తిరుగుతున్న నయవంచక భర్తల జాడలను కనిపెట్టేందుకు, వారిపై ప్రాథమిక చర్యలను తీసుకునేందుకు వీలవుతుంది. అధికారిక లెక్కల ప్రకారం అన్ని దేశాలతో కలిపి సుమారు 25 వేల మంది భారతీయ వధువులకు తమ భర్తలు ఎక్కడున్నారో తెలియని దుస్థితిలో ఉన్న నేపథ్యంలో... ఈ విధానం సబబే అనిపించక మానదు.
ఇందుకోసం విదేశాల్లోని భారత వ్యవహారాల మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, వారితోపాటుగా మన దేశ న్యాయశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, జాతీయ మహిళా కమీషన్ ప్రతినిధులు అందరితో కూడిన ఒక కీలకమైన సమావేశం ఇటీవలనే జరిగింది. ఈ సమావేశంలో ప్రతిపాదనలను తయారుచేసి భారత న్యాయమంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపినట్లు తెలుస్తోంది.
|