"పురుషులందు పుణ్య పురుషులు వేరయా..!" అన్నట్లుగా "మహిళలందు మహిళా నాయకులు వేరయా...!" అని చెబుతోంది ఓ అమెరికన్ తాజా అధ్యయనం. నిజాయితీ, తెలివితేటలు, చాకచక్యం లాంటి విషయాల్లో మగవాళ్లకంటే మహిళా నేతలే మెరుగైన వారని ఆ అధ్యయనం తేల్చిచెబుతోంది.
అమెరికాకు చెందిన "ఫ్యూరీ సెర్చ్ సెంటర్ సోషల్ అండ్ డెమోగ్రఫిక్ ట్రెండ్స్" నాయకత్వ లక్షణాలు గలిగిన స్త్రీ, పురుషుల మధ్య తేడాలను కనిపెట్టేందుకు ఓ అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో పాల్గొన్నవారిలో సగం శాతంమందికి పైగానే స్త్రీ పురుషులిద్దరూ సమానమేనని అభిప్రాయపడ్డారు.| నిర్ణయాలు తీసుకోవడంలో...! |
| | నిర్ణయాలు తీసుకోవడంలోగానీ, సృజనాత్మకంగా వ్యవహరించటంలోగానీ, ఓపికగా ఉండటంలోగానీ, అప్పటికప్పుడు స్పందించటంలోగానీ మహిళలే ముందంజలో ఉన్నారని పరిశీలకులు తేల్చారు. విద్య, ఆరోగ్య పరిరక్షణ లాంటి సామాజిక అంశాల్లో కూడా పురుషుల కంటే స్త్రీలే అధికంగా చొరవ తీసు... |
| |
అయితే... ఉత్తమ నాయకత్వ లక్షణాల విషయానికి వచ్చేసరికి వీరంతా పురుషులకంటే స్త్రీలే తెలివైనవారని.... నిజాయితీ, చాకచక్యం విషయాల్లో వీరికెవరూ సాటిరారని పేర్కొ న్నారు. ఈ అధ్యయనంలో భాగంగా జరిపిన సర్వేలో పురుషులకంటే మహిళలే నిజాయితీపరులని చాలా మంది అభిప్రాయపడ్డారు. పురుషుల్లో మాత్రం ప్రతి ఐదుగురిలో ఒక్కరు మాత్రమే నిజాయితీపరులని చెప్పారు.
అలాగే... నిర్ణయాలు తీసుకోవడంలోగానీ, సృజనాత్మకంగా వ్యవహరించటంలోగానీ, ఓపికగా ఉండటంలోగానీ, అప్పటికప్పుడు స్పందించటంలోగానీ మహిళలే ముందంజలో ఉన్నారని పరిశీలకులు తేల్చారు. విద్య, ఆరోగ్య పరిరక్షణ లాంటి సామాజిక అంశాల్లో కూడా పురుషుల కంటే స్త్రీలే అధికంగా చొరవ తీసుకుంటారని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే... నేరాల నిరోధం, ప్రజాభద్రత లాంటి అంశాలలో మాత్రం తక్కువ మంది మహిళలు సమర్థవంతంగా వ్యవహరించలగని ఈ అధ్యయనం వెల్లడించింది. ఇదిలా ఉంటే... దేశ రక్షణ, జాతీయ భద్రల లాంటి అంశాలలో కూడా మహిళలకంటే... మొత్తం సమాజంలో సగం శాతంమంది మగవాళ్ళే సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారని వారు తెలిపారు.
|