ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > ఇంటిపనిని తక్కువ చేయవద్దు...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఇంటిపనిని తక్కువ చేయవద్దు...
FileFILE
ఇంట్లో ఆడది చేసే పనీ ఒక పనేనా... వంట చేయడం కూడా రాదు సరిగా.. ఆడదానిలా ఎలా పుట్టావు.... ఉయ్యాలలూపడం కూడా ఓ పనే అంటూ ఈసడించుకునేవారికి, ఇంటిపనిని, గృహిణి చేసే పనులను తేలికచేసేవారికి మన సమాజంలో ఈ నాటికీ కొరవలేదు.

ఇంటిబయట అంటే సమాజంలో సంపాదనతో ముడిపడిన పనులు చేసే వారికి.... పైసా సంపాదన కనబడని ఇంటిపనులపై, సహజంగా ఇంటిపనుల భారం మోసే మహిళలపై చిన్న చూపు పూర్వకాలం నుంచీ అలవాటే మరి. సమాజం మారేకొద్దీ, ఇంటిపనిపై సామాజిక పరిశీలనలు పెరిగే కొద్దీ, ఇంటిపనికి వెలకట్టి బయటి సంపాదనకంటే మహిళల ఇంటిపనులు ఏ రకంగానూ తీసిపోవని కొత్త కొత్త సూత్రీకరణలు ముందుకు వస్తున్నాయి.

రెండేళ్ల క్రితం కావచ్చు.. భారతీయ మహిళ చేసే ఇంటిపని తదితర పనులకు ఆదాయ పరంగా విలువ ఉందని, ఇప్పటి లెక్కల ప్రకారంగా చూస్తే మహిళలు చేసే ఇంటిపనులకు కనీసం రూ.3,000ల విలువ ఉంటుందని సాక్షాత్తూ భారత సుప్రీంకోర్టే తీర్పునిచ్చింది.

ఈ నేపథ్యంలో, లండన్‌లో జరిగిన ఓ పరిశోధన ఇళ్లలో మాతృమూర్తుల పనులపై కొత్త విషయాలను బయట పెట్టింది. ఆఫీసులో సగటు ఉద్యోగి చేసే పనికి రెట్టింపు పనిని ఇళ్లలో తల్లులు చేస్తున్నారని తాజా పరిశోధన పేర్కొంది. ఇళ్లలో ప్రతి తల్లీ సగటున రోజులు 15 గంటలపాటు పనిచేస్తున్నారని ఈ పరిశోధన కటిక సత్యం బయటపెట్టింది.

దీంట్లో అయిదున్నర గంటల పనికి మాత్రమే వారికి సంపాదన రూపంలో వస్తోందని, పైగా వారు కనీసం ముగ్గురు పిల్లలను పెంచి పోషించవలసి వస్తోందని ఈ పరిశోధన తెలిపింది.ఈ తాజా పరిశోధన ప్రకారం లండన్‌ మహిళలు రోజుకు 45 నిమిషాల పాటు వంట పనులు చేస్తున్నారని, వారంలో 42 గంటలపాటు ఇంటిపనులకు వెచ్చిస్తున్నారని తెలిసింది.

ఆహార పదార్ధాల కొనుగోలుకు అరగంట సమయం పడుతోండగా, రోజు మొత్తంలో మహిళకు నిద్రా సమయం తప్పితే రెండు గంటల 14 నిమిషాలు మాత్రమే తీరిక సమయం దొరుకుతోందని ఈ పరిశోధన తెలిపింది. దాదాపు 2000 మంది తల్లులపై ఓలీ సంస్థ జరిపిన సర్వేలో పై విషయాలు తెలిశాయి.

ఇన్ని విషయాలు బయటపడుతున్నా సరే... మహిళలూ వారి పనులూ... అని చాలా మంది అనకుండా మానరు.. అవునా మరి....
మరిన్ని
ఉత్తమ నాయకత్వ లక్షణాల్లో అతివలే మేటి!
తాళి కట్టి పారిపోయే భర్తల్లారా.. ఖబడ్దార్..!!
మహిళలకు 18 ఏళ్లలోపే తొలి లైంగికానుభవం..!
నేపాల్ "కుమారీ"లకు స్వేచ్ఛ!
ఒలింపిక్స్‌ : మహిళా గైడ్లకు నగ్న పరీక్షలు
తెలుగింటి ఆడపడచుల "రాఖీ" కోలాహలం