మహిళలు సాంప్రదాయిక పాత్రలు పోషించడమే మంచిదని విశ్వసించే మగవారే ప్రపంచంలో ఎక్కువగా సంపాదిస్తున్నారని తాజా సర్వే తెలిపింది. మహిళల పట్ల సాంప్రదాయిక విశ్వాసాలు, అభిప్రాయాలు లేని వారు సంపాదనలో వెనుకబడి ఉన్నారని ఈ సర్వే సమాచారం.
ఫ్లోరిడా యూనివర్శిటీకి చెందిన డాక్టర్ తిమోతీ జడ్జ్ మరియు బెత్ లివింగ్‌స్టన్‌ల నేతృత్వంలో కొనసాగిన ఈ అధ్యయనం ప్రకారం సమానతా వాద భావాలు కల మహిళలు సాంప్రదాయిక భావాలు కలిగిన వారి కంటే ఎక్కువగా సంపాదించలేదని తేలింది..| స్త్రీ ఇంట్లో... పురుషుడు బయట... |
| | సమాజంలో ఇంటిపని, బయటిపని అనేది ప్రకృతి సహజంగా వచ్చిన పరిణామమని భావించే వారు అత్యాధునిక అమెరికాలోనూ తక్కువమంది లేరని ఈ సర్వే చెబుతోంది. సమాన పనికి సమాన వేతనం అనే భావన అందుకే ఇంకా పూర్తిగా అమలు కాలేదు మరి. |
| |
ఈ అధ్యయనంలో భాగంగా 1979 నుంచి 2005 దాకా నాలుగు దఫాలుగా స్త్రీ పురుషులను ఇంటర్వ్యూ చేశారు. ప్రారంభంలో 12,686 మందిని అధ్యయనం చేశారు ఇందుకు గాను 14 నుంచి 22 సంవత్సరాల దాకా వయస్సు కలిగిన వారిని ఎంపిక చేసుకున్నారు. ఈ నాలుగు ఇంటర్వ్యూలలోనూ పనిస్థలంలోనూ, ఇంటిలోనూ స్త్రీ పురుషుల పాత్రకు సంబంధించి వీరి అభిప్రాయాలను తీసుకున్నారు.
మహిళలు ఇంటి పట్టులో గడపాలా.. ఉద్యోగ మహిళలు పూర్తిగా పురుషులను నిర్లక్ష్యం చేస్తున్నారని భావిస్తున్నారా, పురుషుడు ఇంటిబయటే విజయాలు సాధించాలా, మహిళ ఇల్లు కుటుంబం రెంటినీ చూసుకోవలసిందేనా వంటి ప్రశ్నలను ఈ సందర్భంగా అడిగారు. స్త్రీ ఇంట్లో పురుషులు బయట పనిచేయాలనే దృక్పధం కలిగిన వారు సంవత్సరానికి 8,500 డాలర్లు సంపాదిస్తుండగా, సాంప్రదాయక భావాలు తక్కువగా ఉన్నవారు అంతకు తక్కువే సంపాదిస్తున్నారని ఈ అధ్యయనంలో తేలింది.
చాలామంది సాంప్రదాయక పురుషులు.. ఇల్లు, పనికి సంబంధించి చారిత్రకంగా సమాజంలో విభజన ఏర్పడిందని దీనిని మార్చలేమని భావిస్తున్నట్లుగా సర్వేలో తేలింది. అయితే ఇంటి, బయటి పనిలో స్త్రీపురుషులు సమాన పాత్ర పోషిస్తున్న ఈ రోజుల్లో కూడా ఇదే భావాలు కలవారే ఎక్కువగా ఉన్నారని సర్వే చెప్పింది.
మహిళల విషయంలో ఇది పూర్తి విభిన్నంగా ఉంది. లింగ పరమైన పాత్రలకు సంబంధించి సాంప్రదాయిక భావాలు కలిగిన స్త్రీలు ఆధునిక భావాలు కలిగిన స్త్రీలకంటే 1,500 డాలర్లు తక్కువ వార్షికాదాయం సంపాదిస్తున్నారని ఈ అధ్యయనం చెప్పింది.
కార్మికుల వైఖరి ఎంత సాంప్రదాయబద్ధంగా ఉంటే మహిళల సంపాదనలు అంత ఎక్కువగా ప్రభావానికి గురవుతున్నాయని సర్వే సారాంశం. ఆధునిక వైఖరులు ఉన్న వారి వద్ద వేతనాల వ్యత్యాసం దాదాపుగా లేదని తెలిసింది.
అమెరికా విధానాలు లింగ సమానత్వాన్ని దశాబ్దాలుగా పాటిస్తూ వస్తున్నాయని అయితే తమ అధ్యయనం ప్రకారం సాంప్రదాయక భావాలు ఈ లక్ష్యసాధనకు ఇప్పటికీ వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని సర్వేక్షకులు పేర్కొన్నారు.
అంతటి అమెరికా పరిస్థితే ఇలా ఉంటే భారత్ వంటి వర్థమాన దేశాల పరిస్థితి ఏమిటి...?
|