ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > మహిళలకు ప్రభుత్వం దీపావళి కానుక..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మహిళలకు ప్రభుత్వం దీపావళి కానుక..!
FileFILE
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు దీపావళి కానుకను ప్రకటించింది. ఈ కానుక ఏంటంటే... మహిళల పేరుమీద స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సందర్భంగా వసూలు చేసే 9.5 శాతం ఛార్జీలలో ఒక శాతం మేరకు తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ విషయమై రాష్ట్ర దేవాదాయ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖా మంత్రి జువ్వాడి రత్నాకర రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ప్రస్తుతం రాష్ట్రంలో ఆస్తుల అమ్మకంపై స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుము కలిపి 9.5 శాతం వసూలు చేస్తున్నారని, ఇందులో ఒకశాతం మేరకు మహిళలకు మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు.

మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను దృష్టిలో ఉంచుకునే, మహిళల పేరున స్థిరాస్తుల పట్టాలను ప్రోత్సహిస్తూ ఫీజులో తగ్గింపు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీనివల్ల ప్రతినెలా కోటి రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుందని ఆయన వివరించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
"మహిళా జడ్జి"కీ తప్పని వరకట్న వేధింపులు
ఆలోచనలను గుర్తించడంలో అతివలదే పైచేయి
నిర్మాణ రంగ కార్మిక మహిళలకు ప్రసూతి కానుక
భర్తలకంటే కంప్యూటర్లపైనే అతివల మోజు
"ఆస్టియో పొరాసిస్" బారిన మహిళలు
ప్రపంచం కుప్పగూలుతున్నా ఢోకాలేని వ్యభిచారం...