ఛేదించలేరని నిన్న మొన్నటిదాకా పురుష సమాజం బలంగా నమ్మిన విశ్వాసాలను ఛేదించి ఉండవచ్చు. ఏ పనిలో అయినా పురుషులతో పోటీ పడతాం అని స్త్రీలు ఢంకా భజాయించి మరీ ముందుకు వచ్చి ఉండవచ్చు.. కాని శారీరకంగా చూస్తే మాత్రం మహిళలు పురుషులతో పోలిస్తే ఒక మెట్టు వెనకే ఉన్నారని పరిశోధకులు ముక్తాయిస్తున్నారు.ఈ పరిశోధనల ఆధారంగా... దేంట్లోనయినా మీరు మాతో పోటీ పడవచ్చు గానీ ఊపిరితిత్తులతో మాత్రం కాదు అని పురుషులు చంకలెగరేస్తున్నారు. ఎందుకీ బడాయి అంటే కారణం ఉంది మరి. ఈ మధ్య అమెరికాలోని కాన్సాస్ స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలో స్త్రీలకు వ్యతిరేకంగా ఉండే అంశాన్ని పట్టుకున్నారు.పకృతి పరంగా చూస్తే మహిళల ఊపిరితిత్తులు అంత శక్తివంతం కాదని వీళ్లు తేల్చేశారు. పైగా, ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ద్వారాలు చిన్నవిగా ఉంటాయని.. వీటిలో ప్రోజెస్టిరాన్, ఈస్ట్రోజన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పేశారు. ఫలితంగా పురుషులలో కన్నా మహిళలు తక్కువ ఆక్సిజన్ స్వీకరిస్తారట. ఇదీ మన పరిశోధకుల తాజా ఆవిష్కరణ. దీనికి స్త్రీ పురుష సమానత్వానికి ఉన్న బాదరాయణ సంబంధం ఏమిటో వీరు చెప్పలేదు మరి. ఆక్సిజన్ తక్కువగా పీలిస్తే స్ర్రీలకు పోయేదేమిటో... పురుషులకు అదనంగా వచ్చి ఊడిపడేదేమిటో వీరు చెప్పలేదు. కానీ ప్రచారార్బాటం మాత్రం తక్కువగా లేదు. సామాజిక పరమైన అసమానతలకు, ప్రకృతి పరమైన అసమానతలకు ముడిపెట్టి వ్యాఖ్యానించడం పరిశోధనాకారులకు, మీడియాకు ఫ్యాషనైపోయింది ఈ మధ్య. ఈ కొత్త ఆవిష్కరణ కూడా దీనిలో భాగంగా భావిస్తే సరి. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |