హైదరాబాద్ నగరంలో శనివారం తెల్లవారు జామును 26 ఏళ్ల మహిళను చెరపట్టి సామూహికంగా అత్యాచారానికి పాల్పడిన అయిదుగురు ముష్కరులను పోలీసులు అరెస్టు చేశారు. చిలకలకూడ రైల్వే క్వార్టర్స్‌కు సమీపంలోని ఓ పూరి గుడిసెలో ఈ మహిళ తన భర్త పిల్లలతో కలిసి నిద్రపోతున్న సమయంలో అయిదుగురు దుండుగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమె భర్తను చావగొట్టారని పోలీసులు తెలిపారు. | | నవంబర్ 1న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. తెలుగు తల్లికి నిన్నటితో 52 ఏళ్లు నిండిన మాట నిజమే కాని పాతికేళ్ల వయసు లేని ఈ పేద మహిళ హైదరాబాద్‌లోనే ఉన్న తెలుగు తల్లి విగ్రహం సాక్షిగా రాష్ట్రావతరణ దినం వేకువ జామునే దారుణంగా అత్యాచారానికి గురైంది. |
| |
తర్వాత వారు ఆమె కళ్లకు గంతలు కట్టి సమీపంలో ఉన్న మరుగుకు తీసుకుపోయి సామూహికంగా ఆమెపై అత్యాచారం చేశారని పోలీసులు చెప్పారు. ఒక ఆటో రిక్షా డ్రైవర్‌తో సహా ఈ దారుణానికి పాల్పడిన వారంతా 25 ఏళ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. ఈ అయిదుగురిని ఘటన జరిగిన వెంటనే గుర్తించి పట్టుకుని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. సామూహిక అత్యాచారానికి గురైన ఆ మహిళను వైద్య పరీక్షకు పంపి కేసు బుక్ చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు చెప్పారు.నవంబర్ 1న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. తెలుగు తల్లికి నిన్నటితో 52 ఏళ్లు నిండిన మాట నిజమే కాని పాతికేళ్ల వయసు లేని ఈ పేద మహిళ హైదరాబాద్‌లోనే ఉన్న తెలుగు తల్లి విగ్రహం సాక్షిగా రాష్ట్రావతరణ దినోత్సవం వేకువ జామునే దారుణంగా అత్యాచారానికి గురైంది. మహిళలకు మన రాష్ట్రంలో స్వతంత్రత ఎప్పుడు లభిస్తుంది మరి..! |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |