ముఖంపై మొటిమలు లేస్తే మహిళల ఆత్మ విశ్వాసం ఉన్నఫళంగా నశిస్తుందని మాత్రమే ఇన్నాళ్లుగా అనుకునేవాళ్లం. సౌందర్యానికి, ఆకర్షణకు మొటిమలు అంత అడ్డంకిగా తయారవుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. కాని మొటిమలు ఓ మహిళ వివాహ జీవితాన్ని కూడా చిదిమి వేస్తాయని ఈ ఉదంతం చెబుతోంది. తాను ఇష్టపడి పెళ్లాడిన భార్య ముఖంపై మొటిమలను చూడగానే హనీమూన్‌లో తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించానని ముంబై నగరంలో ఓ భర్త తన భార్యకు విడాకుల నోటీసు ఇచ్చి ఫ్యామిలీ కోర్టులో గెలిచాడు. విచిత్రమైన ఈ అరుదైన కేసును విచారించిన ఫ్యామిలీ కోర్టు సైతం ఈ విషయంలో భర్త వైపే నిలబడటం గమనార్హం. | | మానసిక లోపాలు ఉంటే పెళ్లి చేస్తే అన్నీ కుదురుకుంటాయిలే అనే నమ్మకంతో మన సమాజంలో మగవారి లోపాలు దాచిపెట్టి ఎంతమంది తల్లిదండ్రులు పెళ్ళిళ్లు చేయలేదు? ఎవరు ఎవరిని ఎక్కువగా మభ్యపెడుతున్నారో, లోపాలు దాస్తున్నారో లెక్కలు తేల్చగలిగితే పరిస్థితి ఎలా ఉంటుందో... |
| |
ఈ కేసులో విడాకులకు సమ్మతిస్తూ తీర్పు చెప్పిన ఫ్యామిలీ కోర్టు, ఇది వివాహిత భార్యకు నిస్సందేహంగా విషాదకర సంఘటనే అని పేర్కొంది. అయితే భార్య మొహంలో మొటిమలు గమనించిన భర్త తీవ్రమైన మానసిక వ్యధకు గురయ్యాడు కాబట్టి ఈ విషయంలో తానేమీ చేయలేనని వ్యాఖ్యానించింది. తన వివాహ జీవితాన్ని కొనసాగించకుండా భార్య మొటిమలు తనకు పెద్ద అడ్డంకిగా మారాయని భర్త చేసిన వాదనను కోర్టు సమర్థించడం గమనార్హం. తనకు వ్యాధి ఉందనే విషయాన్ని బహిర్గతం చేయకుండా భార్య తన భర్తను మోసగించిందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఫ్యామిలీ కోర్టు పరిశీలన పట్ల ఇటీవల బాంబే హైకోర్టు తెలియజేసిన అభ్యంతరంతో ఆ మహిళకు కాస్త ఉపశమనం కల్గినట్లయింది. వివరాల్లోకి వస్తే.... అశ్విన్ షా, రీమా దేశాయ్ (పేర్లు మారాయి)లకు 1998 ఫిబ్రవరి 2న పెద్దలు కుదిర్చిన మేరకు వివాహం జరిగింది. పెళ్లయిన వెంటనే దంపతులు మహాబలేశ్వరం వెళ్లారు. ఇరువురికీ 20 ఏళ్లు నిండాయి. అశ్విన్ కుటుంబ వ్యాపారం చేసేవాడు. కోర్టుకు అశ్విన్ తెలిపిన వివరాల ప్రకారం తన భార్య రీమా నోటి చుట్టూ మెటిమలు ఉండటం తన వివాహ సంబంధానికి ఆటంకంగా మారింది. ఈ మొటిమలు నోటి చుట్టూ ఉండటమే కాక అవి పగిలి, వాసన వచ్చేవని తెలిపాడు. ఆమెకు చిన్నప్పటినుంచే ఈ రకమైన చర్మవ్యాధి ఉండేదని, అయితే ఈ విషయం తెలియకుండా మరుగు పర్చిందని తెలియగానే అశ్విన్ ఆగ్రహించాడని కోర్టు రికార్డులు తెలిపాయి. దీంతో ఆమెకు చికిత్స చేస్తూవచ్చిన వైద్యుడి వద్దకు ఆమెను తిరిగి తీసుకుపోమని రీమా తల్లిదండ్రులను అశ్విన్ కోరాడు. ఆమెకు వ్యాధి నయమైన వెంటనే తిరిగి ఇంటికి తీసుకొస్తానని అశ్విన్ హామీ ఇవ్వడంతో నెలరోజుల తర్వాత రీమా తన పుట్టింటికి వెళ్లింది. 1998 మే నెలలో రీమా అశ్విన్‌కు ఫోన్ చేసి తనను ఇంటికి తీసుకువెళ్లక పోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో అశ్విన్ ఆమెకు కోర్టు నోటీసు పంపాడు. ఈలోగా తన అత్తమామలు తనను కట్నం కోసం వేధిస్తున్నారని రీమా పోలీసు కంప్లెయింట్ కూడా ఇచ్చింది. ( కొరవ రెండవ పేజీలో చూడండి) |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |