ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > నెమ్మదైన ప్రముఖురాలు... క్లారా బ్రూనీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నెమ్మదైన ప్రముఖురాలు... క్లారా బ్రూనీ
ప్రపంచంలోనే అత్యంత నెమ్మదైన ప్రముఖరాలిగా ఫ్రాన్స్ అధ్యక్షుని సతీమణి క్లారా బ్రూనీ గొప్ప గౌరవం సాధించారు. మీరు మెచ్చిన అత్యంత నెమ్మదైన ప్రముఖురాలు ఎవరంటూ నిర్వహించిన ఓ సర్వేలో పాల్గొన్న దాదాపు మూడొంతుల మంది బ్రూనీకే పట్టం కట్టడం విశేషం.

ఆల్టర్నేటివ్ కూల్ లిస్ట్ అన్న పేరుతో బ్రిటన్‌లో నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్నవారిలో ఎక్కువమంది బ్రూనీకే తమ ఓటు వేశారు. అదేసమయంలో నటుడు, గాయకుడు అయిన సర్ క్లివ్ రిచర్డ్, సర్ పాల్ మెక్‌కార్ట్నీలు కూడా ఈ జాబితాలో చోటు సంపాధించినవారిలో ఉన్నారు.

ఇటాలియన్ మాడల్‌గా, ఓ గాయనిగా అందరికీ సుపరిచితమైన 40 ఏళ్ల క్లారా బ్రూనీ ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ సతీమణిగా మరింత పేరు సంపాధించిన విషయం తెలిసిందే. గాయనిగా, మాడల్‌గా పరిచయమున్నా సర్కోజీ భార్యగా ఆమె మరింత మంది దృష్టినీ ఆకర్షించడం గమనార్హం. అలాగే తాను మాడల్‌గా ఉన్న సమయంలో తీసినన ఓ నగ్న ఫోటో ఇటీవల వెలుగులోకి వచ్చిన నేపధ్యంలో బ్రూనీ మరింతమందిని ఆకర్షించింది.

బ్రూనీ నగ్న చిత్రమని తెలియడంతో ఈ ఫోటోను సొంతం చేసుకోవడానికి అనేకమంది పోటీపడగా ఓ అజ్ఞాత వ్యక్తి బ్రూనీ నగ్న చిత్రాన్ని 45,500 పౌండ్లు చెల్లించి తన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మొటిమలున్నా సరే.. భార్యకు విడాకులే...
మహిళపై సామూహిక అత్యాచారం: 5గురి అరెస్టు
"మెనోపాజ్" రాకను ముందే పసిగట్టవచ్చు
ఊపిరితిత్తుల్లో మహిళలు వెనుకంజే...
మేము సైతం... మద్యం మత్తులో మహిళామణులు
అబ్బాయిల్లాగా డ్రస్ వేసుకున్నారో...