ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > పనిస్థలంలో స్త్రీలపై వేధింపులు: పాక్ చట్టం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పనిస్థలంలో స్త్రీలపై వేధింపులు: పాక్ చట్టం
FILE
పనిస్థలంలో వేధింపులకు గురయ్యే మహిళలను కాపాడేందుకోసం పాకిస్తాన్ కేంద్ర మంత్రి మండలి కొత్త చట్టాన్ని ఆమోదించింది. ప్రతిపాదిత చట్టం కింద, కార్యాలయాల్లో, పనిస్థలాల్లో వేధింపులను ఎదుర్కొనే మహిళల ఆరోపణలను స్వీకరించి విచారించేందు కోసం ప్రత్యేక అపిలెట్ అథారిటీని పాక్ ప్రభుత్వం నెలకొల్పనుందని దేశ సమాచార మంత్రి షెర్రీ రహమాన్ ప్రకటించారు.

ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదం కోసం పంపడం జరుగుతుందని షెర్రీ చెప్పారు. మహిళలను వేధించే నేరాలకు గాను శిక్షలను పెంచేలా ఈ బిల్లు ద్వారా నేర చట్టాలను సవరించవచ్చునని మంత్రి చెప్పారు.

లైంగిక వేధింపుల గురించి పాక్ మహిళలు చేసే ఆరోపణలను పరిశీలించడానికి కనీసం ఒక మహిళ, ఇద్దరు పురుషులతో కూడిన విచారణ కమిటీని ఏర్పర్చాల్సిందిగా ఈ బిల్లు సంస్థలను కోరుతుందని మంత్రి చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నెమ్మదైన ప్రముఖురాలు... క్లారా బ్రూనీ
మొటిమలున్నా సరే.. భార్యకు విడాకులే...
మహిళపై సామూహిక అత్యాచారం: 5గురి అరెస్టు
"మెనోపాజ్" రాకను ముందే పసిగట్టవచ్చు
ఊపిరితిత్తుల్లో మహిళలు వెనుకంజే...
మేము సైతం... మద్యం మత్తులో మహిళామణులు