ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > అబ్బాయిలు అబ్బాయిలే... అమ్మాయిలు అమ్మాయిలే...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అబ్బాయిలు అబ్బాయిలే... అమ్మాయిలు అమ్మాయిలే...
FILE
తనకంటే చిన్నదైన 13 ఏళ్ల అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకున్న అబ్బాయికి జైలు శిక్ష విధించకుండా 12 నెలల పర్యవేక్షణతో సరిపెట్టిన లండన్ జడ్జి... 'అబ్బాయిలు అబ్బాయిలే, అమ్మాయిలు అమ్మాయిలే జాగ్రత్త' అంటూ ఆ పిల్లాడిని హెచ్చరించారు.

ఈ వింతైన కేసు లండన్‌లోని చెమ్స్‌పర్డ్ కోర్టులో ఎదురైంది. లండన్‌కు చెందిన ఓ అమ్మాయి ఒక అబ్బాయితో అయిదుసార్లు లైంగిక సంబంధం పెట్టుకుంది. తమ సంబంధాలను కొనసాగించే ఉద్దేశంతోటే ఆమె అతడితో ఉద్దేశపూర్వకంగా అరక్షిత లైంగిక సంబంధంలోకి వెళ్లింది. అయితే 13 ఏళ్ల బాలికతో లైంగిక సంబంధం పెట్టుకోవడం సరైందని తాను భావించలేదని 17 ఏళ్ల ఆ అబ్బాయి చెప్పగానే ఆమె కుపితురాలై అతడిపై కేసు వేసింది.
అన్నీ బాగున్నాయి కానీ.. ఏదో..
  అమ్మాయి.. అబ్బాయి.. తప్పు.. జడ్జి మందలింపు.. అన్నీ బాగున్నాయి కానీ ఎక్కడో ఏదో లోపించినట్లుంది.. 13 సంవత్సరాలకే లైంగిక జీవితం.. తలుచుకుంటేనే గగుర్పొడుస్తోంది. తమకు ఏది కావాలో ఏది వద్దో తెలీని వయసు.. అప్పుడే లైంగికానుభవం.. ఏమీ జీర్ణం కావటం లేదు..      


పలితం.. ఆ అబ్బాయి అరెస్టయ్యాడు. అయితే కేసు విచారించిన జడ్జి అతనికి జైలు శిక్ష విధించకుండా 12 నెలల పర్యవేక్షణలో ఉండాలని చెప్పి ఈ విషయాన్ని గుణపాఠంగా తీసుకోమని హెచ్చరించారు.

పరిధికి మించి వ్యవహరించవద్దని, జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉంటామని న్యాయమూర్తి ఈ సందర్భంగా చెప్పారు. నీ కంటే చిన్న వయసులో ఉన్న అమ్మాయిలతో లైంగిక సంబంధంలోకి వెళ్లవద్దని, ఇది నీకు పెద్ద గుణపాఠమని ఆయన హితవు చెప్పారు. నీవు ఎవరితో సెక్స్ సంబంధంలోకి వెళుతున్నావో తెలుసుకుని వ్యవహరిస్తే మంచిదని న్యాయమూర్తి మందలించారు.

ఎందుకంటే మహిళలు తమ మనస్సులను మార్చుకునే ప్రమాదముందని ఆ న్యాయమూర్తులంగారు ప్రవచించారు. గతంలో కూడా బాల్ అనే పేరుగల ఈ న్యాయమూర్తి ఇద్దరు బాల సెక్స్ నేరస్థులను వదిలివేశారు. అయితే లైంగిక చర్యకు ఆహ్వానించినందుకు గాను ఆ బాలికలను ఆయన తప్పుపట్టడం విశేషం. ఈ కేసులో కూడా ఈ అబ్బాయిని లైంగిక నేరస్థుల జాబితాలో చేర్చారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పనిస్థలంలో స్త్రీలపై వేధింపులు: పాక్ చట్టం
నెమ్మదైన ప్రముఖురాలు... క్లారా బ్రూనీ
మొటిమలున్నా సరే.. భార్యకు విడాకులే...
మహిళపై సామూహిక అత్యాచారం: 5గురి అరెస్టు
"మెనోపాజ్" రాకను ముందే పసిగట్టవచ్చు
ఊపిరితిత్తుల్లో మహిళలు వెనుకంజే...