ఆడపిల్లలుగా పుట్టినప్పటికీ వేషభాషల్లో మగరాయుళ్లను తలపిస్తూ ఉండే తమ జీవన శైలిని నిషేధించిన ఫత్వాను మలేషియాలోని టాంబాయ్‌లు ధిక్కరిస్తున్నారు. మలేసియా మతపెద్దలు విధించిన ఫత్వా తమ జీవన శైలిని ఏమాత్రం ప్రభావం వేయబోదని వీరు అంటున్నారు. అమ్మాయిలుగా ఉండకుండా అబ్బాయిల్లాగా వ్యవహరించడం ఇస్లాం మత వ్యతిరేకమని సూచిస్తూ అమ్మాయిల్లోని మగరాయళ్ల సంస్కృతిని నిషేధిస్తూ మలేషియాలో అత్యున్నత ఇస్లామిక్ ధర్మ సంస్థ ఇటీవలే ఫత్వా విధించింది. | | ఇంతకూ ప్రపంచీకరణ వెల్లువలో వర్ధమాన దేశాల అమ్మాయిలు మగవేష ధారణలో కొట్టుకుపోతున్నారా లేదా శతాబ్దాలుగా సాంప్రదాయిక జీవనశైలిని ప్రబోధిస్తూ వచ్చిన సంప్రదాయ సమాజాలలో ఆధునిక జీవతపు తిరుగుబాటులో అమ్మాయిలు పైకి లేస్తున్నారా...? |
| |
కాగా, మలేషియాలో చాలామంది బాలికలు మగరాయుళ్లుగా ఉంటున్నారు. వీరి సంఖ్య రానురాను పెరుగుతూ ఉండటమే కాక వీరిలో కొందరు స్వలింగ సంపర్కానికి కూడా పూనుకుంటున్నారు. ఇస్లామిక్ ధర్మ సూత్రాల ప్రకారం అమ్మాయిలు కురుచ జుత్తును, పొట్టి దుస్తులను ధరించరాదు. అబ్బాయిల్లాగ నడవటం, వ్యవహరించడం కూడా తప్పు. అయితే ఈ ఫత్వాను అనేకమంది మలేసియా అమ్మాయిలు ధిక్కరించడమే విశేషం.ఈ సందర్భంగా విన్ అనే అమ్మాయి -టాంబాయ్- ఫత్వాను లెక్క చేయకుండా మాట్లాండింది. తమ జీవన శైలిని ఈ ఫత్వాలు ఏమీ చేయలేవని తేల్చి చెప్పింది. మగరాయుడిలాగా డ్రస్ వేసుకుంటే తనను ఎవరూ అరెస్ట్ చేయలేరని, తాను ఇతర అమ్మాయిలతో కలిసి భోంచేస్తోంటే కూడా తనను ఎవరూ ఏమీ చేయలేరని ధీమాగా చెప్పింది.నిషేధం అనేది కాగితాలకే పరిమితమవుతుందని, ఎందుకంటే ఒక అమ్మాయి మగరాయడులా ఉందా లేదా అని నిర్థారించడం అధికారులకు కష్టమేపోతుందని ఆమె అంటుంది. తమలో చాలామందిమి తప్పులేమీ చేయలేదని చెబుతోంది. కేవలం సరదా కోసమే తాము టాంబాయ్‌లలాగా వ్యవహరిస్తామని అంటుంది.తమలో కొంతమంది అతికి పోయి లెస్బియన్ సంబంధాల్లోకి కూడా వెళ్లడం జరుగుతోందని ఆమె అంగీకరించింది. అయితే టాంబాయ్‌లకు వ్యతిరేకంగా ఫత్వా రావడం తనకు సరదా తెప్పిస్తోందని ఆమె చెప్పింది. మగరాయడిలా మారాక తను సంతోషంగా జీవితం గడుపుతున్నానని అస్ని అనే 25 ఏళ్ల అమ్మాయి ముక్తాయించింది. ప్రేమలో పడుతున్నానని, తన స్నేహితురాలితో కలిసి జీవిస్తున్నానని కూడా ఆమె చెప్పింది. కాబట్టి ప్రస్తుతానికయితే తాను ఫత్వా గురించి వినదల్చుకోలేదని ఆమె ముగించింది. |