ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > తలపాగాపై వ్యాఖ్యతో బిబిసిలో ఉద్యోగం గల్లంతు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తలపాగాపై వ్యాఖ్యతో బిబిసిలో ఉద్యోగం గల్లంతు
FILE
టాక్సీ డ్రైవర్‌ను కిరాయికి కుదుర్చుకునే విషయంలో జాతివివక్షా వ్యాఖ్యలు చేసిన బీబీసీ రేడియో మహిళా ప్రెజెంటర్‌ను ఆ సంస్థ ఉన్నఫళంగా ఉద్యోగంలోంచి తీసివేసింది. తన కూతురును తీసుకు రావడానికి పంపే డ్రైవర్ ఆసియా ప్రాంతానికి చెందినవాడై ఉండరాదని, తలపాగా కలిగిన డ్రైవర్‌ను చూస్తే తన కూతురికి మతిపోతుందని చెప్పిన నేరానికి 40 ఏళ్ల శామ్ మసాన్ అనే మహిళను బీబీసీ రేడియో ఉద్యోగం నుంచి తొలగించింది.

ఇంతకూ ఆమె చేసిందల్లా ఏమిటంటే తన కూతురును తీసుకువచ్చే కారుడ్రైవర్ ఎవరై ఉండాలి అని చెప్పడమే. లండన్‌లోని కాబ్ ఆపరేటర్‌కు ఫోన్ చేసిన ఈ మహిళ ఆసియా డ్రైవర్‌ను పంపవద్దని కోరింది. తలపాగా ఉన్న వారిని చూస్తే తన కూతురి మతి చెడుతుందని చెప్పింది.
జాతివివక్షా విలువలు...
  జాతివివక్షా వ్యాఖ్యలు చేసికూడా చేయలేదని బుకాయించడం మహామహులకు కూడా వెన్నతో పెట్టిన విద్య అయిపోతున్న నేటిరోజుల్లో కిరాయి డ్రయివర్ తలపాగాపై చేసిన వ్యాఖ్యలకు గాను బీబీసీ తన మహిళా ఉద్యోగిని ఉన్నఫళానా తీసివేసింది. ఇది బీబీసీ విలువగా చెప్పవచ్చా..!      


తన మాటలు జాతివివక్ష కిందికి రావచ్చునని అయితే తాను జాతివివక్షను పాటించేదాన్ని కానని ఆమె చెప్పింది. కారు డ్రైవర్ ఇంగ్లీష్ వ్యక్తి అయితే మంచిదని, మహిళ అయితే మరీ మంచిదని ఆమె జోడించింది.

ఇందుకు తిరస్కరించిన కాబ్ ఆపరేటర్ తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను ది సన్ న్యూస్ పేపర్‌కు పంపాడు. విషయం బయటకు పొక్కిన వెంటనే బీబీసీ రేడియో ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆమె ఇకనుంచి ఆఫీసుకు రావలసిన అవసరం లేదని సమాచారం కూడా పంపారు.

తమ సంస్థలో ప్రెజెంటర్‌గా పనిచేస్తున్న శామ్ మసాన్ వ్యాఖ్యలు రేడియోలో ప్రసారం కాలేదని, అయినా సరే ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమోదించదగనివేనని బీబీసీ ప్రతినిధి చెప్పారు. అందుకే ఆమెను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఫత్వాతో మా జీవనశైలి మారదు: మగరాయుళ్లు
అబ్బాయిలు అబ్బాయిలే... అమ్మాయిలు అమ్మాయిలే...
పనిస్థలంలో స్త్రీలపై వేధింపులు: పాక్ చట్టం
నెమ్మదైన ప్రముఖురాలు... క్లారా బ్రూనీ
మొటిమలున్నా సరే.. భార్యకు విడాకులే...
మహిళపై సామూహిక అత్యాచారం: 5గురి అరెస్టు