పురుషుల మేగజైన్ కోసం నగ్నంగా ఫోజులిస్తే 30 వేల డాలర్లను ఇస్తామంటూ వచ్చిన ప్రతిపాదనను ఆస్ట్రేలియా యువజన, క్రీడా మంత్రిణి కేట్ ఎల్లిస్ తిప్పికొట్టారు. ఆస్ట్రేలియా చరిత్రలో అతి పిన్నవయస్సులో పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికైన కేట్ సెక్సియస్ట్ ఎంపీగా పేరు సాధించారు. ఈమె సెక్సీతనాన్ని చూసిన పురుషుల మేగజైన్ జూ పత్రికలో ముద్రించడానికి కేట్ చిత్రాలకోసం ప్రయత్నిస్తే పోలా అని భావించింది. అయితే కేట్ ముందుకు ఈ ప్రతిపాదన తెచ్చినప్పుడు ఆమె భుజాలు ఎగురవేసి, అందుకు తాను ముందుకు రాలేనని చెప్పారు. ఈ సారి పత్రిక నిండా ఆమె నగ్నత్వాన్ని పరచాలని ఆశపడిన సంపాదకుడు పాల్ మెర్రిల్ తాను తీవ్రంగా ఆశాభంగం చెందానని చెప్పారు.| పురుషుల పత్రిక.. బాగుండదులే.. |
| | ఈ రోజుల్లో డబ్బులెవరికి చేదు.. అసలే మాంద్యం... కాని సెక్సీ ఎంపీ కేట్ అలా భావించలేదు. ఛఛఛ.. పురుషుల పత్రికకా, నేనా.. నగ్నంగానా... అంటూ ఏదో మొహమాటానికి గురైందామే. తదుపరి ప్రధాని పదవిపై చూపు సారించిన వారికి ఈ ప్రతిపాదనలు ప్రమాదకం అని ఆమెకు తెలుసు మరి. |
| |
కేట్ అంటే ఎందుకు చాలామంది ఆసక్తి చూపుతారో ఒకసారి ఆమెకేసి చూపు మరల్చితే అర్థమైపోతుందని జూ ఎడిటర్ చెప్పారు. అయితే తమ పత్రికకు నగ్నదేహంతో ఫోజివ్వాలని తాము చేసిన ప్రతిపాదనను ఆమె తిరస్కరించగానే తామంతా నిరాశకు గురయ్యామని పాల్ వాపోయారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త మాంద్యం ప్రజలకు నైతిక స్థైర్యం ఇవ్వవలిసిన సమయంలో ఆమె తన అభిమానులకు ఆ అవకాశం దక్కనీయకుండా చేశారని పాల్ పాపోయారు. తమ పత్రికకు ఫోజ్ ఇవ్వడానికి తిరస్కరించిన కేట్ ఎల్లీస్ ఆస్ట్రేలియా తదుపరి ప్రధానిగా తనను ప్రచారం చేసుకోవడాన్ని ఈరోజు నుంచే మొదలు పెట్టేశారని పాల్ పేర్కొన్నారు. |