ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > "ఆడదానికి ఆడదే శత్రువు" : హెలెన్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"ఆడదానికి ఆడదే శత్రువు" : హెలెన్
FILE
అత్యాచారానికి గురైన మహిళలపట్ల మహిళా న్యాయమూర్తులు అంతగా సానుభూతి చూపలేరంటూ హాలీవుడ్ నటి హెలెన్ మిర్రెన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. లైంగికపరమైన అసూయ కారణంగా న్యాయస్థానాల్లో "ఆడదానికి ఆడదే శత్రువు"గా మారుతోందని హెలెన్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

"సన్" అనే పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హెలెన్... "లైంగికపరమైన అసూయలతో మహిళాజడ్జిలు ఉన్న విషయాన్ని పసిగట్టడం వల్లనే... రేప్ కేసుల్లో పురుషుడి తరపు వాదిస్తున్న న్యాయవాదులు, జ్యూరీలో మహిళా న్యాయమూర్తులు ఉండాలని కోరుకుంటారని" వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అంతేగాకుండా... రేప్ కేసులకు సంబంధించి కోర్టులలో వీలైనంతమంది ఎక్కువ న్యాయమూర్తులు ఉండేలా చూసుకుంటారని... మనసు లోతుల్లో దాగిన యుగాల నాటి భావనల కారణంగానో, సంచార తెగల అసూయతోనో, లేదా కేవలం శత్రుత్వంతోనో వారు ఇతర మహిళలకు వ్యతిరేకంగా నడచుకుంటారని హెలెన్ పేర్కొన్నారు.

దీంతో... ఒకవైపు బ్రిటన్‌లోని మహిళా న్యాయమూర్తులంతా హెలెన్‌పై కారాలు, మిరియాలు నూరుతుంటే... మరోవైపు హెలెన్ అజ్ఞానంతో చేసిన వ్యాఖ్యలు తప్ప మరోటి కాదని, ఆ వ్యాఖ్యలకు ఎలాంటి ప్రాతిపదికా లేదని లాయర్ జనరల్ వెరా బాయిడ్ కొట్టిపారేశారు.

అంతేగాకుండా... ఇలాంటి వ్యాఖ్యలవల్ల అత్యాచారం కేసు నిందితులు, తమ కష్టాలు చెప్పుకునే సమయంలో ఇబ్బందిపడే పరిస్థితిని కల్పించవచ్చునని వెరా బెయిడ్ హెచ్చరించారు. కాగా, కొన్ని నెలల క్రితం డేటింగ్ సందర్భంగా తాను అత్యాచారానికి గురైనట్లు అంగీకరించిన కొన్ని వారాల సమయంలోనే, హెలెన్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రికార్డు స్థాయిలో మహిళా ఐఏఎస్ ట్రైనీలు
డబ్బులిస్తే మాత్రం.. బట్టలిప్పుతానేంటి!
మహిళల పురోభివృద్ధి అంటే ఇదేనా..?!
తలపాగాపై వ్యాఖ్యతో బిబిసిలో ఉద్యోగం గల్లంతు
ఫత్వాతో మా జీవనశైలి మారదు: మగరాయుళ్లు
అబ్బాయిలు అబ్బాయిలే... అమ్మాయిలు అమ్మాయిలే...