ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > నోయిడాలో మహిళ పోలీస్ స్టేషన్: మహీందర్ సింగ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నోయిడాలో మహిళ పోలీస్ స్టేషన్: మహీందర్ సింగ్
FILE
నోయిడాలో మహిళా పోలీస్ స్టేషన్ త్వరలో ఏర్పాటు కానుంది. మహిళలకు పూర్తి రక్షణ కల్పించే దిశగా ఈ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నోయిడా సీఈవో మహీందర్ సింగ్ వెల్లడించారు.

ఈ మేరకు సోమవారం జరిగిన 156వ బోర్డు సమావేశానికి అనంతరం మహీందర్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ... నోయిడాలో పోలీస్ స్టేషన్‌ను నిర్మించేందుకు సెక్టార్-43లో, దాదాపు 1.2 ఎకరాల నేలను కేటాయించనున్నట్లు తెలిపారు.

ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించిన భూమిని, చదరపు మీటరుకు ఒక రూపాయి చొప్పునే అందజేస్తున్నామని సింగ్ అన్నారు. నోయిడాలో పోలీసు వ్యవస్థను పటిష్టపరిచే దిశగా ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు త్వరలో సన్నాహాలు చేపడుతామని సింగ్ తెలిపారు.

ఇంకా... తాగునీటి సరఫరా కనెక్షన్లను పెంచాలని బోర్డు సమావేశంలో నిర్ణయించామని మహీందర్ సింగ్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం రూ. 1500లకు లభిస్తున్న తాగునీటి కనెక్షన్లు, ఇకపై రూ. 500లకే పొందవచ్చునని సింగ్ అన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఐఎఎస్‌ శిక్షణలో మహిళల హవా
మాకు ముద్దులు కావాల్సిందే... ఆస్ట్రియా
స్త్రీలపై అత్యాచారాలను సహించేది లేదు!
"ఆడదానికి ఆడదే శత్రువు" : హెలెన్
రికార్డు స్థాయిలో మహిళా ఐఏఎస్ ట్రైనీలు
డబ్బులిస్తే మాత్రం.. బట్టలిప్పుతానేంటి!