ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > అత్తలేని కోడలు... కోడలు లేని అత్త..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అత్తలేని కోడలు... కోడలు లేని అత్త..!
FILE
"అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మా... కోడల్లేని అత్త గుణవంతురాలు... ఆహా... ఊహూ..." అనే పాట మీకు గుర్తుండే ఉంటుంది. మన సమాజంలో నెలకొన్న మానవ స్వభావాన్ని వ్యంగ్యంగా, సున్నితంగా ఆవిష్కరించిన ఆ పాట ఆషామాషీగా చెప్పుకునే సామెత లాంటిది కాదనీ, కాచి వడబోసిన జీవిత సత్యమని తాజా కేంబ్రడ్జి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

వివరాల్లోకి వస్తే... డాక్టర్ టెరీ ఆప్టర్ నేతృత్వంలో, కేంబ్రిడ్జి పరిశోధక బృందం పలువురు వివాహిత మహిళల మనోగతాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఈ పరిశోధనల్లో అత్తా కోడళ్ల గొడవ భారతీయ సమాజానికి మాత్రమే పరిమితమైనది కాదని, పాశ్చాత్య సమాజంలో కూడా ఇలాంటి గొడవలు మామూలేననన్న విషయం తేలిందని వారు చెబుతున్నారు.

పై పరిశోధనల్లో కొంతమంది మహిళలను పరిశీలించగా...తమ అత్తగార్ల వల్ల అప్పుడప్పుడూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు 75 శాతం మంది మహిళలు చెప్పగా, అత్తలతో వేగడం తమవల్ల కాదని, అన్ని సమస్యలకంటే ఈ సమస్య నుంచి బయటపడటం చాలా కష్టమని 15 శాతం మహిళలు వాపోయినట్లు చెప్పారు.

వంటల్లో వంకలు పెట్టడం దగ్గర్నించి మొదలైన సణుగుడు, పిల్లలను అదుపు చేయడం, ఇతరత్రా చాలా విషయాల్లో కలగజేసుకోవడం దాకా సాగి, సాగి... చివరకు తమకు మనశ్శాంతి అనేదే లేకుండా చేస్తున్నారని... అత్తలచే బాధితులైన మహిళలు తమకు ఫిర్యాదు కూడా చేశారని పరిశోధకులు పేర్కొన్నారు.

కాబట్టి... అత్తలచేత బాధితులైన మహిళలు "అత్తలేని కోడలు ఉత్తమురాలు" అని అనుకోవడం సహజమే. అలాగే... కోడళ్ల సాధింపులతో సతమతమవుతున్న అత్తలు కూడా ఈ సమాజంలో లేకపోలేదు. అలాంటి వారుకూడా "కోడల్లేని అత్త గుణవంతురాలు" అంటూ పాడుకోవడం కూడా అంతే సహజం. ఇలా అనుకోవడం, పాడుకోవడం లేకుండా ఉండాలంటే... అత్తా, కోడళ్లు సఖ్యంగా ఉండాల్సిందే...! అయితే తరతరాలుగా కొనసాగుతున్న ఈ స్వభావం అంత సులభంగా మాసిపోతుందా అన్నది మాత్రం సందేహమే...!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
శ్రీలంక మహిళలకూ తప్పని గృహ హింస..!
నోయిడాలో మహిళ పోలీస్ స్టేషన్: మహీందర్ సింగ్
ఐఎఎస్‌ శిక్షణలో మహిళల హవా
మాకు ముద్దులు కావాల్సిందే... ఆస్ట్రియా
స్త్రీలపై అత్యాచారాలను సహించేది లేదు!
"ఆడదానికి ఆడదే శత్రువు" : హెలెన్